Bheemla Nayak: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ దూకుడుకి షాక్ అవుతున్న సినీ వర్గాలు

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్‌గా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి పలు ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో, పవన్ కళ్యాణ్ రానా ల పరిచయ వీడియోలు విడుదల కాగా, ఇవి సినిమాపై మరింత ఆసక్తి ను పెంచేశాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఇప్పటి వరకు 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించింది. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. టైటిల్ సాంగ్ దూకుడుకు సినీ వర్గాలు షాకవుతున్నాయి. అక్టోబర్ 15న చిత్రం నుండి అంత ఇష్టం అంటూ ఒక మెలోడియస్ పాట విడుదల చేయనున్నారు. నిత్యా మీనన్,పవన్ మధ్య ఈ సాంగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది. కాగా, చిత్రంలో రానా సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

