Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!

అందాల ముద్దుగుమ్మ సమంత 2017లో నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6-7 తేదీల్లో హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ అక్టోబర్ 2న చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు. అన్ని పరిస్థితులు బాగుండి ఉంటే వారు నేడు యానివర్సరీ వేడుక జరుపుకొని ఉండేవారు.
ఈ రోజు నాగ చైతన్య- సమంత యానివర్సరీ కాగా, విడిపోయిన తర్వాత ఈ జంట వాటికి సంబంధించి ఏమైన జ్ఞపకాలను గుర్తు చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, సమంత సింగిల్ ఫొటో షేర్ చేస్తూ భావోద్వేగపు పోస్ట్ పెట్టింది. పాత ప్రేమ పాటలు, పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.
తెల్లని డ్రెస్ ధరించి నేలపై చూస్తూ ఒంటరిగా నడుస్తున్న ఫొటో షేర్ చేస్తూ సమంత పెట్టిన అందరికి కన్ఫ్యూజింగ్గా మారింది. ఏడాది క్రితం సమంత తమ పెళ్లి రోజు సందర్భంగా నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి.. ‘‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్’’ అని క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- naga chaitanya
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

