Nithiin | మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు నితిన్ !!

Sai dharam tej and nithiin | చాలా రోజుల తర్వాత నితిన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గత ఏడాది కరోనాకు ముందు భీష్మతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అలాగే రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. చెక్.. మ్యాస్ట్రో సినిమాలే అందుకు నిదర్శనం. చెక్ సినిమాలో ఉరిశిక్ష పడిన ఖైదీగా, చెస్ ప్లేయర్‌గా నటిస్తే.. మ్యాస్ట్రోలో చూపులేని వ్యక్తిగా నటించాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం ( Macherla Niyojakavargam ) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఇందులో నితిన్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నితిన్ పాత్ర గురించి ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో వెళ్లున్నాడు. ఇప్పటివరకు లవర్‌బోయ్‌గా కనిపించి ఈ హీరో.. ఇప్పుడు మాస్ యాంగిల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు నితిన్. పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చుట్టూ నిప్పు ఉండగా కత్తులు, ఇతర ఆయుధాలతో విలన్స్ దాడి చేసుందుకు ముందుకు వస్తుండగా.. నితిన్ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నితిన్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్‌గా నటించాడు. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. మరి కలెక్టర్‌గా నితిన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pooja Hegde | వారి కోసం కాల్షీట్లు లేవంటున్న పూజాహెగ్డే..!
Nithiin | ప్రేమ కథలు చేయను..ట్రోలింగ్ చేస్తారు: నితిన్
Krithi Shetty | నవ్వుతో హృదయాలను కొల్లగొడుతున్న కృతి శెట్టి..
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
sai dharam tej | ఓటీటీలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా.. ఎప్పట్నుంచి అంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

