Nithiin | ప్రేమ కథలు చేయను..ట్రోలింగ్ చేస్తారు: నితిన్
మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాస్ట్రో. నితిన్ (Nithiin) హీరోగా నటించిన మ్యాస్ట్రో సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు నితిన్.

టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin) తొలిసారి ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నాడు. మ్యాస్ట్రో (Maestro) చిత్రంలో అంధుడిగా కనిపించబోతున్నాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాస్ట్రో. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాధున్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. అంధుడి పాత్రలో నటించడం నాకు సవాలు లాంటిది. కమర్షియల్, ప్రేమ కథలతో సినిమాలు చేశా. కానీ డార్క్ కామెడీ నేపథ్యంలో సినిమా చేయడం మొదటిసారి అని అన్నాడు.
ఒరిజినల్ వెర్షన్ లో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు. జనాలు ఒరిజినల్ వెర్షన్ తో పోలుస్తారని తెలుసు. ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా తప్పు జరుగుతుందన్న కారణంతో ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. అంధుడి పాత్ర కోసం కొంత హోం వర్క్ చేయాలనుకున్నా. కానీ చెక్, రంగ్ దే సినిమాల బిజీ షెడ్యూల్స్ తో వెంటనే మ్యాస్ట్రో చిత్రీకరణలో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పాడు నితిన్.
మంచి అవుట్ పుట్ వచ్చినందుకు టీం అంతా సంతోషంగా ఫీలవుతున్నాం. కానీ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదన్న లోటు మాత్రం ఉండిపోయింది. తమన్నా గతంలో ఎన్నడూ చేయనట్వంటి రోల్ లో నటించింది. అందుకే మ్యాస్ట్రో సినిమా తాజా ఫీల్ ను కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు నితిన్. నాకు ప్రేమకథలు చేసి చాలా బోర్ కొట్టింది. ఇక నుంచి మ్యాస్ట్రో లాంటి భిన్నమైన సినిమాలు చేస్తానని చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

