పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..

Bheemla Nayak | పవన్ కళ్యాణ్ సినిమాలపై ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిట్టు ఫ్లాపు తర్వాత.. ముందు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. అందుకే అత్తారింటికి దారేది తర్వాత సరైన బ్లాక్ బస్టర్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలపై అంత క్రేజ్. ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు రికార్డు బిజినెస్ పవన్ కళ్యాణ్ సినిమాలకు జరుగుతుంది. మిగిలిన హీరోలు కుళ్లుకునే మార్కెట్ ఆయన సొంతం. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు రీమేక్ ఇది. పవన్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు అయినా కూడా తెర వెనక నుంచి మొత్తం త్రివిక్రమ్ నడిపిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు గురూజీ అందిస్తున్నాడు. దాంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాలో లేని కొన్ని సన్నివేశాలు తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు త్రివిక్రమ్ యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా నిడివి విషయంలో కూడా దర్శక నిర్మాతలు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. మలయాళం ఒరిజినల్ సినిమా 2 గంటల 50 నిమిషాలకు పైగానే ఉంటుంది. కానీ తెలుగులో అంత సేపు ఉంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే దీన్ని రెండున్నర గంటలకు కుదించినట్లు తెలుస్తోంది. దీని కోసం కొన్ని సన్నివేశాలు తీసేసి.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మరికొన్ని కొత్త సన్నివేశాలు జోడించినట్టు ప్రచారం జరుగుతోంది.
అయ్యప్పనుమ్ కోశీయుమ్ లో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ రానాని పూర్తిగా డామినేట్ చేస్తోంది. పైగా టైటిల్ కూడా పవన్ పేరు పెట్టారు. దీన్ని బట్టి తెలుగులో మార్పులు భారీగానే ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా మరో స్థాయిలో జరుగుతుంది. నైజాం హక్కులను దిల్ రాజు ఏకంగా 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన అన్ని ఏరియాల్లో కూడా భీమ్లా నాయక్ బిజినెస్ భారీగా జరుగుతుంది. జనవరి 12న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nithya Menen | పవన్‌కల్యాణ్‌తో పనిచేయడం చాలా ఈజీ : నిత్యమీనన్
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Bheemla Nayak : భీమ్లా నాయక్ ఏంటి ఇంత రచ్చ చేస్తున్నాడు..!
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్
Daniel Shekhar | డేనియల్ శేఖర్ పాత్రకు రానా ఎంత తీసుకున్నాడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

