టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి భీమ్లా నాయక్ (Bheemla Nayak). త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా..సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాన్ టైటిల్ రోల్ చేస్తుండగా..మరో హీరో రానా (Rana) ఈ చిత్రంలో జాయిన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. డెనియల్ శేఖర్ గా భీమ్లా నాయక్ లో రానా ఎంట్రీ మామూలుగా ఉండటం లేదని ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియోతో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే మరి రానా ఈ సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయించాడు. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది అందరూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ విషయానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. రానా ఈ చిత్రానికి 25 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు మొదటిసారి తాను రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఇంటికి పట్టుకెళ్లాడట. రానాకు హీరోగా సోలో హిట్స్ అందుకోలేదు..అందువల్లే ఆ చిత్రాలకు ఇలాంటి ప్యాకేజీని అందుకోలేకపోయాడు. ముందుగా భీమ్లా నాయక్ లో నెగెటివ్ పాత్ర కోసం చాలా మంది యువ హీరోలను మేకర్స్ సంప్రదించగా..ఎవరూ ముందు రాలేదట.
ఇక రానా డెనియల్ పాత్ర చేసేందుకు పచ్చజెండా ఊపి ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంటికి తీసుకెళ్లడం తొలి సారి అని అంతా తెగ చర్చించుకుంటున్నారు. డెనియల్ శేఖర్ లాంటి పాత్ర కోసం రానా అయితే బాగుంటుందని గుర్తించడానకి చాలానే కష్టపడ్డారట మేకర్స్.
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!