Bheemla Nayak: భీమ్లా నాయక్ ఏంటి ఇంత రచ్చ చేస్తున్నాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత రానాతో కలిసి భీమ్లా నాయక్(Bheemla Nayak) అనే సినిమా చేస్తున్నాడు.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. చిత్రానికి భీమ్లా నాయక్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, చిత్రంలో పవన్ పాత్ర పేరు కూడా ఇదే అని తెలుస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు. బుధవారం “భీమ్లా నాయక్” అప్డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 07:02 గంటలకు “లాలా భీమ్లా” వీడియో సాంగ్ ప్రోమో విడుదలవుతుందని ప్రకటిస్తూ, “ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అని ప్రకటించారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు.ఇది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా, బిజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

