టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) ఒకడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ యాక్టర్‌తో ఒక్క సారైనా నటించాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం ఏ కొందరికి మాత్రమే వస్తుంది. అలాంటి అరుదైన అవకాశమే కొట్టేసింది నిత్యమీనన్ (Nithya Menen). భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రంలో పవన్‌కల్యాణ్ భార్యగా నటిస్తోంది నిత్యమీనన్. ఇప్పటికే విడుదలైన నిత్యమీనన్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ నుంచి నిత్యమీనన్ టీజర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. పవన్‌కల్యాణ్‌తో పనిచేయడంపై ఓ చిట్ చాట్‌లో తన స్పందనను అందరితో షేర్ చేసుకుంది నిత్యమీనన్. పవన్‌తో పనిచేయడం ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చిందని చెప్పింది. ఒరిజినల్ వెర్షన్లో ఉండే పాత్ర కంటే భీమ్లానాయక్లో నేను పోషించిన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యముంటుందని చెప్పింది నిత్యమీనన్.
‘భర్తను కమాండ్ చేసే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తా. త్రివిక్రమ్ (Trivikram) తో పనిచేయడమంటే ఇష్టం. ఈ సినిమా కోసం 4-5 రోజులే షూట్లో పాల్గొన్నా. అయినా పవన్ లాంటి సైలెంట్ పర్సన్‌తో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. అంతేకాదు ఆయనతో పనిచేయడం చాలా ఈజీ‘ అంటూ నిత్యమీనన్ చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!