parijat alias night jasmine | నారింజ రంగు రెమ్మలతో తెల్లగా మెరిసిపోయే పారిజాతం పూల పరిమళాన్ని ఆస్వాదించడం చాలామందికి ఇష్టం. పారిజాతం చెట్టును సత్యభామ కోరిక మేరకు స్వయంగా శ్రీకృష్ణుడే స్వర్గం నుంచి తీసుకువచ్చాడని అంటారు. ఈ సన్నివేశం ఆధారంగా నంది తిమ్మన ఏకంగా ‘పారిజాతాపహరణము’ అనే ప్రబంధాన్నే రచించాడు. పారిజాతాన్ని నైట్ జాస్మిన్, హర్సింగార్ అనీ పిలుస్తారు. పారిజాతం పూలను అలంకరణకు మాత్రమే కాకుండా ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పువ్వులకు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. రుతువుల్లో మార్పువల్ల వచ్చే జ్వరాలు, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి లాంటి సమస్యలను నయం చేయడంలో పారిజాతం ఆకులు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది ఆయుర్వేద వైద్యుల మాట. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి పారిజాతం పువ్వులనూనెను అరోమా థెరపీలో ఉపయోగిస్తారు. ఇది మెదడులో సెరటోనిన్ స్థాయులను పెంచుతుందని చెబుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ కాయతింటే షుగర్ కంట్రోల్.. మలబద్ధకానికి చెక్..!!
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
cancer risk | ఈ గింజలు తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు
వంటింట్లో ఉండే వీటిని కూరలతో తీసుకుంటే ఇంత మేలు జరుగుతుందా?