వంటింట్లో ఉండే వీటిని కూరలతో తీసుకుంటే ఇంత మేలు జరుగుతుందా?

health tips | మన తాత ముత్తాతలంతా రసాయనాల్లేని ఆహారమే తిన్నారు. ఏం తినాలనిపించినా ఇంట్లోనే వండుకొన్నారు. వాళ్లు పుష్కలంగా వాడిన సంప్రదాయ మసాలా దినుసులు ఔషధాల్లా పనిచేశాయి. కాబట్టే, వందేండ్లు ఆరోగ్యంగా జీవించారు. ఆ దినుసులను మనమూ వంటల్లో విరివిగా వాడితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
ఇంగువ: ముద్దపప్పు తాలింపులో, పులిహోర తయారీలో ఎక్కువగా వాడతారు. ప్రత్యేకమైన రుచిని, వాసనను ఇస్తుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.
జీలకర్ర: పోపు గింజల్లో ముఖ్యమైంది. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు వివిధ జ్వరాల నుంచి రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కడుపు నొప్పి, అజీర్తి, వాంతులు, విరేచనాలు
తదితర సమస్యలను నియంత్రిస్తుంది.

దాల్చిన చెక్క: మసాలా కూరల్లో, బగారా అన్నంలో ఎక్కువగా వాడతారు. కేకుల తయారీలోనూ పనికొస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల టైప్-2 మధుమేహ
బాధితులకు ఔషధంతో సమానం.
అల్లం: గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను దూరం చేస్తుంది. మిగతా రోగుల్లో శస్త్ర చికిత్సల అనంతరం, క్యాన్సర్ పేషెంట్లలో కీమోథెరపీ తర్వాత వచ్చే వాంతులు, విరేచనాల సమస్యను తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పిని దూరం చేస్తుంది.
మిరియాలు: ఒకప్పుడు మనదేశంలో నల్ల మిరియాలు బాగా వాడేవారు. శ్వాస సంబంధ
సమస్యలు, దగ్గు, రక్తహీనత, గుండె జబ్బుల నుంచి ఇవి రక్షణ కలిగిస్తాయి. మాంగనీస్, ఐరన్, పొటాషియం, విటమిన్-కె, విటమిన్-సి కూడా పుష్కలం.
నువ్వులు: సెసామిన్, సెసామోలిన్ అనే ప్రత్యేక పదార్థాలను కలిగిన నువ్వులు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిలో జింక్, క్యాల్షియం, ఫాస్పరస్, కాపర్ అపారం. కాపర్ ఎముకల దృఢత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ కాయతింటే షుగర్ కంట్రోల్.. మలబద్ధకానికి చెక్..!!
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
cancer risk | ఈ గింజలు తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
Honey Trap | యువతిగా నటిస్తూ యువకులతో పరిచయం పెంచుకుని..
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

