Decoration Cycle | సైకిల్ ఓ జ్ఞాపకం, ఉద్వేగం. బాల్యంనాటి పుష్పక విమానం. మీకు ఎంతో ఇష్టమైన పాత సైకిల్ ప్రయాణానికి పనికిరాకుండా పోయినప్పుడు.. మూలనపడేయకండి. ఇంట్లోనో, ఆరు బయటో అలంకరణకు వాడుకోండి. ‘బేసిన్ బ్యూటీ’ గా మార్చుకోండి.
కొన్ని జోడింపులతో పాత సైకిల్‌ను వాష్ బేసిన్గానూ ఉపయోగించవచ్చు. అలా వద్దనుకుంటే.. స్ట్రింగ్లైట్లను జోడిస్తే సరి. రాత్రిళ్లు మెరిసిపోతూ ఉంటుంది. ఇంకొన్ని పాత చక్రాలు సేకరించి.. ఫెన్సింగ్లా మార్చుకోవచ్చు. అంతేనా, అందమైన పూల కూండీగానూ వాడుకోవచ్చు. ఆలోచన ఉండాలే కానీ, పాత సైకిల్‌కు పదులకొద్దీ రూపాలు!
“Household Tips | సామాన్లు కొనేముందు ఇవి చెక్ చేస్తున్నారా?”