Household Tips | దుకాణం నుంచి సరుకులు తీసుకురాగానే.. శుభ్రంగా అరల్లో సర్దుకుంటారే కానీ, దాని ఎక్స్పైరీ డేట్ గురించి ఆలోచించరు చాలామంది. ఇది మంచి అలవాటు కాదు.
› ఆహార పదార్థాలు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చినవి తీసుకోవద్దు.
› ఎక్స్పైరీ డేట్ అనేది ఆ పదార్థం నిల్వ స్థితిని బట్టి నిర్ధారిస్తారు. అంటే ఆ తేదీ తర్వాత వాటి వాడకం ఏమాత్రం సురక్షితం కాదు. ఎంతోకొంత హానికరం కూడా.
› ఎక్స్పైరీ డేట్ తర్వాత ఆయా పదార్థాలలో పోషక విలువలు తగ్గిపోతాయి.
› చాలా వస్తువులు సహజ గుణాల్ని కోల్పోతాయి. రంగు, రుచిలో తేడాలు వస్తాయి. వాటిని అమ్మడానికి, తినడానికి వీల్లేదు.
› దుకాణాల్లో మసాలా దినుసులు, బ్రెడ్, స్నాక్స్ వంటివి సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. దీనివల్ల రుచిని కోల్పోకుండా ఉంటాయి.
› ఈస్ట్ వంటివి ఎక్స్పైరీ డేట్ తర్వాత తమ సహజ గుణాన్ని కోల్పోతాయి.
› తేనె, వెనిగర్, చక్కెర, బియ్యం వంటి వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు.
› బ్రెడ్ 3-4 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత మైక్రోబ్స్ పెరిగిపోతాయి.
“ఇంట్లో ఫ్రిజ్‌ను ఎలా పడితే అలా వాడేస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే !!”