కరోనా టైం.. మీ టవల్స్ శుభ్రంగానే ఉన్నాయా?
మీ టవల్స్ శుభ్రంగానే ఉన్నాయా | జూ వాడే టవల్ ఎంతవరకు శుభ్రంగా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? టవల్స్‌ను తరచూ శుభ్రం చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటి?

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఎన్నోసార్లు టవల్‌ను వాడుతుంటాం. కాళ్లు, చేతులు, ముఖం తుడుచుకుంటూనే ఉంటాం. మరి మీరు రోజూ వాడే టవల్ ఎంతవరకు శుభ్రంగా ఉంది? అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? టవల్స్‌ను వాడుతున్నప్పుడు వాటిపై బోలెడన్నీ బ్యాక్టీరియాలు చేరిపోతుంటాయి. అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి టవల్స్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ కరోనా టైంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టవల్స్‌ను ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. ఒకరి టవల్‌ను మరొకరు అస్సలు వాడొద్దు. మరి టవల్స్‌ను తరచూ శుభ్రం చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం..

బ్యాక్టీరియాకు ఆవాసం
మనం ఎక్కడెక్కడో తిరిగొచ్చి స్నానం చేస్తుంటాం.. మొహం కడుక్కుంటాం. ఆ తర్వాత టవల్‌తో తుడుచుకుంటాం. అలా టవల్‌తో తుడుచుకుంటున్నప్పుడు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా టవల్‌పై చేరుతుంటుంది. అలా మనం వాడే టవల్స్‌లో 90 శాతం వరకు కోలిఫామ్ అనే బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇలా క్రిములు, బ్యాక్టీరియా చేరిన టవల్‌ను శుభ్రం చేసుకోకుండా వాడితే తొందరగా జబ్బు పడతాం. అందుకే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి కచ్చితంగా టవల్స్‌ను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాడిన తర్వాత బెడ్‌పై వేయొద్దు
చాలామంది టవల్‌ను వాడిన తర్వాత బెడ్‌పై, కుర్చీపై లేదా సోఫాపై వేస్తుంటారు. అలా వేయడం వల్ల టవల్ తొందరగా ఆరకుండా ఎక్కువసేపు తడిగా ఉంటుంది. దీనివల్ల తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి వీలైనంత వరకు టవల్‌ను బయట గాలి తగిలే చోటనే ఆరేయాలి. కుదరకపోతే ఇంట్లో ఫ్యాన్ గాలికి అయినా ఆరేయాలి.

వెనిగర్‌తో ఉతకాలి
టవల్స్‌ను నామమాత్రంగా అసలు ఉతకవద్దు. మంచి డిటర్జెంట్ వాడి వాటిని శుభ్రం చేయాలి. డిటర్జెంట్‌తో పాటు కొద్దిగా వెనిగర్‌ను కలిపితే మంచిది. దీనివల్ల దుస్తులు పూర్తిస్థాయిలో శుభ్రం అవుతుంది.
ఎక్కువ రోజులు ఒకే టవల్ వాడొద్దు
చాలామంది టవల్స్‌ను నెలల తరబడి వాడుతుంటారు. కొందరైతే చిరిగిపోయే వరకు వాడుతూనే ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. పదే పదే టవల్స్‌ను ఉతికినప్పుడు అవి పాడవుతుంటాయి. అలాంటి టవల్స్‌తో తుడుచుకుంటున్నపుడు.. మన శరీరంపై ఉన్న నీటిని అంత త్వరగా పీల్చుకోలేవు. దీని కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా టవల్స్‌పై బ్యాక్టీరియా కూడా ఎక్కువగా చేరుతుంది. అందుకే తరచూ టవల్స్‌ను మారుస్తూ ఉండాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ సరిపోదా?
కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి ఆహారం తినాలి? ఏం తినకూడదు?
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలా? దీన్ని తినండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

