కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలా? దీన్ని తినండి
ఈ కరోనా టైంలో నీరసాన్ని తగ్గించి, ఇమ్యూనిటీ పెంచడంలో కొబ్బరి దోహదపడుతుంది. ఇతర వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది.

ప్రకృతి మనకిచ్చిన గొప్ప బహుమతి కొబ్బరి. దీంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఈ కొబ్బరిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, కుడుక, కొబ్బరి నూనె అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ కరోనా టైంలో నీరసాన్ని తగ్గించి, ఇమ్యూనిటీ పెంచడంలో ఇది దోహదపడుతుంది. ఇతర వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి అవేంటో చూద్దామా..

ఇమ్యూనిటీ పెంచుతుంది..
కరోనాతో పాటు ఏ ఇతర వ్యాధి నుంచైనా రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం లేదా కొబ్బరి ముక్కలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో కరోనాతో పాటు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రిస్తుంది..
కొబ్బరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను మందగించడానికి సహాయపడుతుంది.

జుట్టుకు పోషణనిస్తుంది..
కొబ్బరి నూనె జుట్టుకు పోషణనిస్తుంది. అందుకే దీనిని హెయిర్ ఆయిల్గా విస్తృతంగా వాడుతారు. కొబ్బరి నూనె పొడి, కఠినమైన జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

చర్మరక్షణకు తోడ్పడుతుండి..
చర్మరక్షణకు కొబ్బరి తోడ్పడుతుంది. చర్మ సమస్యలకు ఇంట్లో పెద్దవారు కొబ్బరినూనెనే ఎక్కువగా వాడుతారు. దోమ కాటుకు గురైనప్పుడు, ఇతర గాయాలు తగినప్పుడు ఇంట్లో మొదట కొబ్బరి నూనెనే రాస్తారు. ఇది చర్మంపై గీతలు, గడ్డలు, మచ్చలు, గాయాలను మాన్పేందుకు ఉపయోగపడుతుంది.

పచ్చి కొబ్బరితో వంటకు రుచి..
పచ్చి కొబ్బరిని వంటలలో ఉపయోగిస్తారు. చాలా కూరల్లో దీన్ని తురిమి వేస్తుంటారు. ఇది కూరకు అదనపు రుచిని తీసుకొస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు పోషకాలుంటాయి. కనుక ప్రతిఒక్కరూ తప్పక తినాల్సిన పదార్థం. దీనిని కూరలతోపాటు స్వీట్లలోనూ ఉపయోగిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ సరిపోదా?
కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి ఆహారం తినాలి? ఏం తినకూడదు?
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

