e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

Covid Vaccine Diet : క‌రోనా వైర‌స్ ( Corona Virus ) నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ( Vaccination ) ప్ర‌క్రియ వేగ‌వంతం చేశారు. జ‌నాలు కూడా కొవిడ్‌-19 ( Covid-19 ) బారిన ప‌డొద్ద‌ని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.. అయినా ఇంకా చాలామందిలో ఏవేవో అనుమానాలు ! టీకా వేయించుకుంటే ఎలాంటి దుష్ప్ర‌భావాలు వస్తాయోన‌నే భ‌యం కొంద‌రిలో ఉంటే.. కొవిడ్‌-19 టీకా తీసుకున్న త‌ర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? క‌రోనా వ్యాక్సిన్ ( Corona Vaccine ) తీసుకునే ముందు ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తిన‌కూడ‌ద‌ని సందేహాలు మ‌రికొంద‌రిలో ఉన్నాయి. అయితే కొన్ని ఆహార నియ‌మాల‌ను పాటిస్తే వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి అవేంటో చూద్దామా..

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది

కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, త‌ర్వాత నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. నీటిని ఎక్కువ‌గా తాగ‌డంతో పాటు నీటి శాతం ఎక్కువ‌గా ఉన్న పండ్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని నీటి స్థాయులు పెరుగుతాయి. త‌ద్వారా నీర‌సం త‌గ్గి పున‌రుత్తేజం కావ‌డంతో పాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా మెరుగ‌వుతుంది. ఫ‌లితంగా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు.

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

ఆల్క‌హాల్ తీసుకోవ‌ద్దు

- Advertisement -

ఆల్క‌హాల్ సేవించే వారు టీకా తీసుకోవ‌డానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న త‌ర్వాత కొన్ని రోజుల వ‌ర‌కు మందు తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న త‌ర్వాత శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆల్క‌హాల్‌ డ్రింక్ చేస్తే శ‌రీరం తొంద‌ర‌గా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. దీనివ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుందని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఇమ్యూనిటీ త‌గ్గిపోతే.. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనే శ‌క్తి త‌గ్గిపోతుంది.

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

ప్రాసెస్‌డ్ ఫుడ్ వ‌ద్దు

ఈ కరోనా స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అదే ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటే.. అందులో ఉండే అధిక క్యాల‌రీలు, సంతృప్త‌ కొవ్వులు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపిస్తుంది. త‌ద్వారా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను త‌ట్టుకునే శ‌క్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ బ‌దులు అధిక ఫైబ‌ర్ ఉండే గోధుమ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం మంచిది.

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

చ‌క్కెర ప‌దార్థాలు తినొద్దు

క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, తీసుకున్న త‌ర్వాత‌ విశ్రాంతి చాలా అవ‌స‌రం. ఎంత ఎక్కువ నిద్ర‌పోతే అంత చురుగ్గా ఉంటాం. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో సంతృప్త కొవ్వులు, చ‌క్కెర‌స్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చ‌క్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌.. స‌రైన విశ్రాంతి ఉండ‌దు. వీలైనంత వ‌ర‌కు అధిక ఫైబ‌ర్ ఉండే ఆహారమే తీసుకోవాలి.

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

స‌మ‌తుల్య ఆహారం తీసుకోవాలి

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామందిలో అల‌స‌ట‌, నీరసం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి ఈ దుష్ప్ర‌భావాల నుంచి బ‌య‌ట ప‌డాలంటే శ‌రీరానికి శ‌క్తినిచ్చే, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే స‌మ‌తుల్య ఆహారం తీసుకోవ‌డం మంచిది. ఫైబ‌ర్ అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు తినాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Covid Vaccine Diet : క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి? ఏం తిన‌కూడ‌దు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement