ఇంట్లో ఫ్రిజ్‌ను ఎలా పడితే అలా వాడేస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే !!
Refrigerator | ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ నిత్యావసరమైపోయింది. అయితే చాలామందికి ఫ్రిజ్ పనితీరు, దాని నిర్వహణ విషయంలో తగినంత అవగాహన ఉండదు. దాంతో తరచూ చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఫ్రిజ్ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.
♦ కొత్తగా ఫ్రిజ్ కొన్నప్పుడు కనెక్షన్ పెట్టక ముందు అరగంట పాటు ఫ్రిజ్ డోర్ తీసి ఉంచాలి. మీరు వాడేది పాత మోడల్ ఫ్రిజ్ అయితే దానికి స్టెబిలైజర్ తప్పనిసరి. విద్యుత్ సరఫరాల్లో వచ్చే వోల్టేజీ తేడాలను ఇది సరిచేస్తుంది. ప్రస్తుతం వచ్చే ఫ్రిజ్‌లకు స్టెబిలైజర్ లోపలే అమర్చి వస్తుంది.
♦ ఫ్రిజ్ పని తీరు కంప్రెసర్ మీద అధారపడి ఉంటుంది. కంప్రెసర్ సమస్యలున్నాయా లేదా అనేది పరిశీలించుకోవడం మంచిది. ఫ్రిజ్ వెనుక ఉండే కాయిల్స్ మీద చెత్తా చెదారం పడకుండా చూడాలి. లేదంటే కాయిల్స్ సరిగ్గా పని చేయక కంప్రెసర్ మీద భారం పడి ఫ్రిజ్ పనితీరు మందగిస్తుంది.
♦ కనీసం నెలకోసారైనా ఫ్రిజ్‌లోని పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలు కడిగి ఆరనివ్వాలి. బయటివైపు శుభ్రం చేసేందుకు కోలిన్ లిక్విడ్ వాడాలి. లేకపోతే క్రిమికీటకాలు చేరే అవకాశం ఉంటుంది. 2 గంటలకు మించి విద్యుత్ కోత ఉన్నప్పుడు ఫ్రిజ్ డోర్ తెరచి పెట్టాలి. లేకుంటే లోపలి పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది.
♦ పిల్లలు తరచుగా ఫ్రిజ్ తెరిచి చూస్తుంటారు. అయితే తిరిగి తలుపు సరిగ్గా వేయడం మరిచిపోతారు. దీనివల్ల లోపలి చల్లదనమంతా బయటికి వెళ్లిపోయి కంప్రెసర్ మీద భారం పడుతుంది. దీంతో విద్యుత్ బిల్లు పెరుగుతుందని గుర్తించాలి.
♦ విద్యుత్ ఆదా కోసమని రాత్రి ఫ్రిజ్‌ను ఆఫ్ చేయకూడదు. విద్యుత్ బిల్లు మరీ ఎక్కువగా వస్తుంటే మాత్రం రాత్రి పడుకునే ముందు దాన్ని డీఫ్రాస్ట్ చేయవచ్చు. నెలల తరబడి ఊరెళ్లితే మాత్రమే ఫ్రిజ్ స్విచ్చాఫ్ చేయాలి. ఫ్రిజ్‌ను ఆఫ్ చేసేముందు అందులో ఏమీ ఉండకుండా చూసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

