Interior Design | కరోనా తర్వాత చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. లాక్డౌన్ సమయంలో రోజంతా ఇంట్లోనే ఉండటంతో, ఇంటీరియర్ డిజైనింగ్‌పై చాలామందికి ఆసక్తి కలిగింది. దాంతోపాటే పచ్చదనం మీద ప్రేమ, పర్యావరణం పట్ల శ్రద్ధ అధికం అయ్యాయి. వాటన్నిటికీ అద్దం పట్టేలా ఉంటున్నది.. ఇంటీరియర్ డిజైనింగ్ ట్రెండ్ @ 2022
పాంటోన్ కలర్స్
అమెరికాకు చెందిన పాంటోన్ అనే కంపెనీ కొత్తకొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తుంది. ప్రతి ఏడాదీ ఒక్కో రంగును పాంటోన్ మ్యాచింగ్ కలర్‌గా విడుదల చేస్తుంది. చాలా మంది డిజైనర్లు ఆ రంగునే ఎక్కువగా ఉపయోగిస్తారు. తాజాగా రెండు కలర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.. గ్రే, ఎల్లో. వాల్ బ్యాక్‌డ్రాప్ నుంచి ఫర్నిషింగ్స్ వరకు అన్నిట్లోనూ ఈ రెండు రంగులే ఇప్పుడు.
రౌండెడ్ ఫర్నిచర్
నిన్న మొన్నటివరకూ స్ట్రెయిట్ లైన్స్, కర్వ్డ్ ఫినిషింగ్ కలిగిన ఫర్నిచర్‌ను ఉపయోగించారు. తాజాగా రౌండ్ షేప్ రాజ్యమేలుతున్నది. సోఫా, డైనింగ్ టేబుల్ నుంచి పడక కుర్చీల వరకు అన్నిట్లోనూ రౌండెడ్ షేప్కే ఓటేస్తున్నారు.
లేత రంగు కలప
ఒక్కో కలపకు బేస్ షేడ్ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు మహాగని రకం కలప ముదురు రంగులో ఉంటుంది అలాగే మ్యాపెల్, రబ్బర్ ఉడ్ లేతరంగుల్లో ఉంటాయి. ఈ ఏడాది లేత రంగు కలప ట్రెండింగ్‌లో ఉంది. ఈ వన్నె ఫ్లోరింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది.
ఎకో-ఫ్రెండ్లీ డిజైన్
ప్రకృతి ఎంత అందమైందో మనకు తెలుసు. టెక్నాలజీ, ఫ్యాషన్ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ కారణంగా ప్రకృతి స్పృహ పెరిగింది. ఇంటీరియర్‌లోనూ ఎకో ఫ్రెండ్లీ డిజైన్లనే ఎంచుకుంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులను సాధ్యమైనంత దూరం పెడుతున్నారు.
రెట్రోస్టైల్
డిస్కో లైట్ల నుంచి ఆర్చీల వరకు 1980ల నాటి డిజైన్స్‌కు పూర్వవైభవం వస్తున్నది. మెటాలిక్ లైట్లు, పాతతరం కిటికీలు ఇంటిని ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. గ్రామ్‌ఫోన్ రికార్డులు, ఇత్తడి సామగ్రి, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు, ఇత్తడి బిందెలు, బోషాణాలు గృహాలంకరణలో భాగం అవుతున్నాయి.
Inshah Bashir | కాలం కాళ్లు లాగేసుకుంటే.. వీల్‌చైర్‌తోనే గమ్యానికి పరుగెత్తింది
Migraine | ఆఫీస్‌లో మైగ్రేన్ సమస్యలా..? ఈ టిప్స్ పాటించండి!
లవ్ మ్యారేజి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడి అమ్మాయిల ఓపెన్ ఆఫర్