Inshah Bashir | కాలం కాళ్లు లాగేసుకుంటే.. వీల్‌చైర్‌తోనే గమ్యానికి పరుగెత్తింది
Inshah Bashir | అప్పుడు ఇన్షా బషీర్‌కు 15 ఏండ్లు. బాస్కెట్‌బాల్ కోర్టులోకి దిగితే.. చిరుతలా పరుగెత్తేది. మెరుపువేగంతో దూసుకొచ్చి.. ప్రత్యర్థుల నుంచి బాల్ అందుకొని నెట్లో వేస్తున్నప్పుడు.. సివంగిని తలపించేది. బాస్కెట్‌బాల్ క్రీడలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది ఈ కశ్మీరీ బాలిక కల. బంగారు పతకం సాధించాలన్నది జీవిత లక్ష్యం. అయితే, ఓ రోడ్డు ప్రమాదం రెండు కాళ్లనూ నిర్జీవంగా మార్చేసింది. అయినా సరే, ఇన్షా వెనక్కి తగ్గలేదు. బాస్కెట్‌బాల్ కోర్టులో ఇప్పటికీ తన ఆధిపత్యం చలాయిస్తూనే ఉన్నది.
అదే ఉత్సాహం. అంతే వేగం.. కాళ్లకు బదులుగా చేతులతో పరుగెడుతున్నది ఇన్షా. వీల్‌చైర్ మీది నుంచే విల్పవర్తో ఆట కొనసాగిస్తున్నది. ప్రమాదం జరిగిన తొలినాళ్లలో ఇన్షా చాలా కుంగిపోయింది. బంధువుల సూటిపోటి మాటలతో ఆత్మహత్యకు యత్నించింది. తన సామర్థ్యంపై నమ్మకంతో మళ్లీ పుంజుకుంది. కాళ్లు లేకపోతేనేం.. కదంతొక్కాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రాణప్రదమైన బాస్కెట్‌బాల్‌ను మళ్లీ అందుకుంది. కశ్మీర్‌లోనే ‘తొలి వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్’గా గుర్తింపు తెచ్చుకుంది. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా.. ఆటపై మక్కువతో డాక్టరు కోర్సును కాదనుకుంది. బీఏ, బీయీడీ చేసింది. మరోవైపు మునుపటి పటిమను సొంతం చేసుకొని జాతీయ పారా బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్నది. ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ విజిటర్ ప్రోగ్రామ్’లో పాల్గొనేందుకు యూఎస్ కాన్సులేట్ నుంచి ఆహ్వానం అందుకున్నది. ప్రస్తుతం ‘రెస్ట్ ఆఫ్ ఇండియా విమెన్స్ బాస్కెట్ బాల్’ జట్టు సభ్యురాలిగా కొనసాగుతున్నది.
తనలాంటి దివ్యాంగులకు స్ఫూర్తినిచ్చే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నది ఇన్షా. టెడెక్స్ వంటి వేదికల మీదినుంచి తన జీవిత అనుభవాలను చెబుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. ‘నాలాంటి వారినంతా కలిపి ఒక జట్టుగా చేస్తే.. కశ్మీర్లో ఆల్ విమెన్ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ టీమ్ లేదన్న
అసంతృప్తికి తెరపడుతుంది. పారాలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతోమంది క్రీడాకారులు తయారవుతారు’ అంటున్నది ఇన్షా బ‘షేర్’.
Read More :
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

