Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!
Shark Tank India | బిక్కుబిక్కుమంటూ బుద్ధిజీవి. ఎదురుగా.. కార్పొరేట్ దిగ్గజాలు. అంతా యోధానుయోధులే. బుద్ధిజీవి తన ఐడియా గురించి చెబుతాడు. దిగ్గజాలు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సందేహాలు లేవనెత్తుతారు. ఘాటైన వ్యాఖ్యానాలు చేస్తారు. అయినా, తట్టుకోవాలి. ధైర్యంగా జవాబులివ్వాలి. ‘గట్టిపిండం’ అనిపించుకోవాలి. అంతిమంగా పచ్చజెండా ఎగరాలి. నిధులు వరదై పారాలి. సోనీ టీవీ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమం అనేక ఐడియాలకు రూపమిచ్చింది. ఎంతోమంది స్వాప్నికులకు విజయాన్ని రుచి చూపింది.

వేదిక..
షార్క్ ట్యాంక్ ఇండియా, ముంబై
ఏడుగురు షార్క్‌లు (ఇన్వెస్టర్లు) కొత్త ఆంత్రపెన్యూర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా ఓ యువకుడి ఆలోచన సావధానంగా విన్నారు. ఆ తర్వాత ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే, ఆ యువకుడు ఎందుకో తడబడ్డాడు. ఇన్వెస్టర్లు కొంత నిరుత్సాహపడ్డారు. ఆ తర్వాత ఆ వేదిక ఎక్కింది హైదరాబాద్‌కు చెందిన దువ్వూరి వర్షిత. మధుమేహ రోగుల కోసం తయారుచేసిన ‘ఈజీ లైఫ్’ అనే పరికరాన్ని పరిచయం చేసింది. ఆత్మవిశ్వాసంతో పెట్టుబడిదారులను మెప్పించింది, ఒప్పించింది. ఆ ఆవరణ చప్పట్లతో మార్మోగింది. పెట్టుబడి రూపంలో లక్షలాది రూపాయలు వచ్చాయి. మరెంతోమంది ఇన్వెస్టర్లు మేము ఉన్నామంటూ ముందుకొచ్చారు. ఇలా, వందలాది ఆంత్రపెన్యూర్స్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ వేదిక ఎక్కారు. ఐడియాలతో ఆకట్టుకుని తమ కలలకు ఓ రూపం ఇచ్చారు.
అమెరికన్ షో స్ఫూర్తితో..
ప్రతిభావంతులైన ఆంత్రప్రెన్యూర్స్‌ను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్ ట్యాంక్ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమం 2021లో ప్రారంభమైంది. ఇటీవలే మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా 43 సరికొత్త ఆవిష్కరణలు కార్యరూపం దాల్చాయి. ఐడియా జీవులు ఆంత్రప్రెన్యూర్స్ అయ్యారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలా ప్రవహించాయి. ‘పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గిపోతున్నది. ఇలాంటి వేదికలను ఆసరాగా చేసుకొని మహిళా ఆంత్రప్రెన్యూర్లు ముందుకు రావాలి. మంచి వ్యాపార ఆలోచనను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి’ అని పిలుపునిస్తారు షో షార్క్ సీయీవో నమితా థాపర్.
నమ్మకం ఉంటేనే..
షార్క్ ట్యాంక్ ఇండియా వంటి వేదిక వరకూ రావాలంటే.. ఆవిష్కర్త తన ఐడియాను బలంగా నమ్మాలి. దానివల్ల ఓ సామాజిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఒప్పించగలగాలి. అధ్యయనాలు, సర్వేలు, నిపుణుల అభిప్రాయాలతో ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలి. సమగ్ర సమాచారంతో సంస్థ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తమదైన కార్పొరేట్ ప్రపంచంలో బతికే.. ఇన్వెస్టర్లు, నిమిషాలను లక్షల్లో కొలిచే కుబేరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్లను ఒప్పించగలిగితే చాలు.. నిధులు ప్రవహిస్తాయి. కాకపోతే, ఆ ప్రశ్నల శరపరంపరను తట్టుకోవాలి. నేర్పుగా జవాబివ్వాలి. అంతిమంగా ఒప్పించాలి, మెప్పించాలి. ఎంత గొప్ప ఐడియా అయినా కొన్నిసార్లు ఇన్వెస్టర్ల బుర్రకు ఎక్కకపోవచ్చు. అందులో ఏవో లోపాలు కనిపించవచ్చు. అయినా మనం నిరాశపడకూడదు. మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి. ఆ ఐడియాను మరింత సానబట్టాలి, లేదంటే.. కొత్త ఐడియాను సృష్టించుకోవాలి.

Read More :
“Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!


