లవ్ మ్యారేజి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడి అమ్మాయిల ఓపెన్ ఆఫర్
Noiva do Cordeiro | ‘మా గ్రామంలోని అందమైన, చలాకీ అమ్మాయిలకు పనిమంతులైన పెండ్లి కొడుకులు కావలెను. మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెండ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. ఏదో పేరుకు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు.. ఇరుపక్షాలు ఒప్పుకొంటేనే వివాహం. అయితే, ఆ తర్వాత మా గ్రామంలో ఉండేందుకు మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి’ అంటూ ఆ మధ్య ఓ ప్రకటన హోరెత్తింది. ఆసక్తికరంగా ఉంది కదూ! అయితే, చదవండి.

ఉదయం పదింటికి నిద్రలేచి, బెడ్ కాఫీ తాగి, స్నానం చేసి.. ఆ తర్వాత పనులు చూసుకునే రకం కాదు అక్కడి అమ్మాయిలు. కోడి కూతతో మేల్కొంటారు. పలుగూ పార పట్టుకొని పొలానికెళ్తారు. ఉదయమంతా పొలం పనులు చూసుకొని, మధ్యాహ్నం చదువుకుంటారు. సాయంత్రం మళ్లీ చిన్నచిన్న పనులుంటే పూర్తిచేసుకొని చర్చికి వెళ్తారు. ‘మదర్ హౌస్’లో తోటి యువతులతో పాటలు పాడుతూ, కథలు చెప్పుకొంటూ సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచీచెడ్డ మాట్లాడుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు చాలా మర్యాద ఇస్తారు. పొలం పనికి వెళ్తారు కదా.. నల్లగా, చామనఛాయతో ఉంటారేమో అనుకోకండి. అప్సరసలకు తీసిపోరు. దేవకన్యలను తలపించే దేహాలు వారివి. ముట్టుకుంటే కందిపోయే రకం. అలాంటి అమ్మాయిలు సరైన జోడీ కోసం వెతుకుతున్నారు. మీరింకా బ్రహ్మచారులా? పెండ్లీడు వచ్చిందా? విదేశీ అమ్మాయిలను ప్రేమించి సంప్రదాయబద్ధంగా పెండ్లి చేసుకునే కోరిక ఉందా? అయితే బ్రెజిల్‌లోని నోయివా డొ కోర్డెరో వెళ్లండి.

ఇదీ ఆ ఊరి కథ..
బ్రెజిల్‌కు చెందిన మారియా సెన్హోరిన్హా 1891లో ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే అతనికి అప్పుడే పెండ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినా బలవంతంగా మనువాడింది. ఆ చర్యతో మారియాను బంధువులు, చర్చి పెద్దలు బహిష్కరించారు. డొ కోర్డెరో గ్రామానికి వచ్చింది నోయివా. అక్కడే స్థిరపడింది. అనంతరం పురుషాధిక్యత లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. ఆ ప్రయత్నంలో విజయవంతం అయింది. అయితే, 1940లో వారి విధానాలు నచ్చని ఓ పాస్టర్ అక్కడ ఓ చర్చిని స్థాపించాడు. తర్వాత ఓ సొసైటీని ఏర్పాటు
చేశాడు. ఆ గ్రామ మహిళలకు కొన్ని పరిమితులు విధించాడు. వాటివల్ల వారు మరింత పేదవారిగా మారారు. దీంతో ఆ చర్చిని కూలగొట్టి, తమకు నచ్చిన విధంగా మరో చర్చిని నిర్మించారు అక్కడి మహిళలు. తమకంటూ కొన్ని ఆచారాలు, పద్ధతులు, నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని అతిక్రమించడానికి వీలు లేదు.

మూడు షరతులు..
ఇక్కడి అమ్మాయిలను పెండ్లి చేసుకోవాలంటే.. ముఖ్యంగా మూడు షరతులు. ఏ ఒక్కటి అతిక్రమించినా మళ్లీ ఇంటిబాట పట్టాల్సిందే. ఇంతకీ ఆ కండిషన్లు ఏమిటంటే? ఒకటి.. వంట. రెండు.. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం. మూడు.. టాయిలెట్ కడగడం. ‘ఓసోస్! అదెంత పని. అవన్నీ మాకు వచ్చు కదా’ అంటారేమో.. ఆ మూడింటినీ మీ ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పనిచేసినా ఆలూమగలు కలిసే చేయాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే, అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే. స్వేచ్ఛగా బతకడం వారికి పుట్టుకతో వచ్చిన హక్కు. అలా అని విశృంఖలత్వం ఉండదు. ఎవరికి ఎవరూ యజమాని కాదు. మరొకరికి బానిసలు కానేకారు. సమానత్వం వారి నినాదం.

శ్రమైక జీవనం..
నోయివా డొ కోర్డెరో గ్రామంలోని అమ్మాయిలు స్వేచ్ఛాజీవులు. వారి జీవన విధానంఆసక్తికరం. అక్కడ ఏ అమ్మాయి ఇల్లు కట్టుకోవాలనుకున్నా.. మిగతావారంతా ఆ పనిలో పాల్గొంటారు. వ్యవసాయమే వీరి జీవనాధారం. పొలంలో తలో పనిచేస్తారు. పంట పండించడం మొదలు, ఫలసాయాన్ని 60 మైళ్ల దూరంలోని మార్కెట్‌కు తరలించడం వరకూ ఒకరికొకరు సాయపడుతుంటారు. ఉపాధి కోసం సొంత వ్యాపారాలూ ప్రారంభించారు. అయినా సరే, వేకువజామునే లేచి పొలాలకు వెళ్తారు. స్వీట్‌కార్న్, మిరియాలు, బెండకాయలు, చింత
పండు ప్రధాన పంటలు. పరస్పర ప్రేమ, గౌరవం, అందమైన కుటుంబం.. ఆ మగువల ఆశలు! ఆ కలల్ని నిజం చేస్తామని మాటివ్వగలిగితే.. కల్యాణ ప్రాప్తిరస్తుః!
Read More :
మన దగ్గర డ్రైవింగ్ సీటు కుడివైపు ఉంటే.. అమెరికాలో ఎడమ వైపు ఎందుకుంటుంది ? ఎందుకీ తేడా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
Lily Dale | ఇచట దెయ్యాలతో మనసు విప్పి మాట్లాడొచ్చు
ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

