e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Lily Dale | ఇచ‌ట దెయ్యాల‌తో మ‌న‌సు విప్పి మాట్లాడొచ్చు

Lily Dale | ఇచ‌ట దెయ్యాల‌తో మ‌న‌సు విప్పి మాట్లాడొచ్చు


Lily Dale | ‘నీ చివరి కోరిక ఏమిటి? వెంటనే తీరుస్తాను?’, ‘లాకర్‌ పాస్‌వర్డ్‌ నీకు మాత్రమే తెలుసు. ఒకసారి చెబుతావా?’, ‘పక్కింటి అమ్మాయి కలలోకి వెళ్లి వేధిస్తావట. నిజమేనా?’.. హఠాత్తుగా, మన మధ్యలోంచి వెళ్లిపోయిన వ్యక్తులను అడిగితీరాల్సిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అక్కడికెళ్తే నిర్భయంగా అడగవచ్చు, నిఖార్సయిన జవాబు రాబట్టుకోవచ్చు. ఆ ప్రాంతం పేరు.. లిల్లీ డేల్‌!

Lily Dale
Lily Dale

ఆ క్షణం రూత్‌ కలలన్నీ కల్లలయ్యాయి. రెప్పపాటులో చనిపోయింది. చివరి నిమిషంలో ఆస్తిని పిల్లల పేరున రాయాలన్న ఆలోచనను నిజం చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మరణ దేవత. భర్త జాన్‌ అసలే శాడిస్టు. పిల్లల భవిష్యత్‌పైనే ఆమె బెంగంతా. రూత్‌ చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతున్నదని గ్రహించిన స్నేహితురాలు లీనా, వెంటనే రూత్‌ పిల్లలను తీసుకొని న్యూయార్క్‌లోని ‘లిల్లీ డేల్‌’కు వెళ్లింది. అక్కడి తాంత్రికులు రూత్‌ ఆత్మతో మాట్లాడించారు. ఆస్తిని పిల్లల పేరున రాసేయడంతో.. ఆ చుట్టుపక్కల రూత్‌ అలికిడి కనిపించలేదు. వింత శబ్దాలు మళ్లీ వినిపించలేదు.

ఆత్మీయుల దర్శనం కోసం..

- Advertisement -

హఠాత్తుగా ఆత్మీయులను కోల్పోయారా? తీరని కోరికలతో రగిలిపోతున్న ప్రేతాత్మలను శాంతింపజేయాలని అనుకుంటున్నారా? అయితే, న్యూయార్క్‌లోని కసాడగా సరస్సు పక్కనే ఉన్న ‘లిల్లీ డేల్‌’కు వెళ్లండి. మీ సమస్యను చెప్పండి. ప్రియమైన ప్రేతాత్మలతో కాసేపు ముచ్చటించండి. వారి ఆశలు తెలుసుకోండి. తీరని కోరికలేమైనా ఉంటే తీర్చండి. ఆ ఆత్మకు శాంతి కలిగించండి. మనుషులే కానక్కర్లేదు. ప్రియమైన పెంపుడు జంతువుల ఆత్మలతోనూ మాట్లాడవచ్చు. ‘ఇదంతా ఉత్త ముచ్చటే. ఈ కాలంలో కూడా ప్రేతాత్మలు ఎక్కడున్నయ్‌?’ అని దీర్ఘాలు తీయకండి. అక్కడికి వెళ్లిన ఎంతోమంది వితండవాదులు, ఆత్మలతో మాట్లాడారు. దయ్యాలున్నాయని అంగీకరించారు.

Lily Dale
Lily Dale

ఆత్మలకు, మనుషులకు వారధిగా..

ఇక్కడి తాంత్రికులు జీవాత్మలకు, ప్రేతాత్మలకు మధ్య వారధిగా ఉంటారు. ఇటు చనిపోయిన వారి చేయిపట్టుకొని, అటు బతికిన వారి చేయిపట్టుకొని.. దుబాసీలా ఒకరి సంభాషణను మరొకరికి చేరవేస్తారు. ఈ విధానాన్ని ‘మీడియంషిప్‌’ అంటారు. ఈ పద్ధతిలో పెంపుడు జంతువులు, దేవదూతల నుంచి సమాచారాన్ని తీసుకొస్తారు. ఆ సందేశాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియ
జేస్తారు. కాకపోతే, ప్రతి పనికి ఓ ధర ఉంటుంది. ఆత్మల సంభాషణ వినిపించేందుకు 80 నుంచి 100 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. లిల్లీ డేల్‌లో ఫారెస్ట్‌ టెంపుల్‌ ఉంది. రోజూ రాత్రి ఏడు గంటలకు ధ్యానం నిర్వహిస్తారు. ఆ ధ్యానంలో ఆత్మలు కూడా పాల్గొంటాయని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిల్లీ డేల్‌ అసెంబ్లీ సభ్యులు జూమ్‌ వంటి వర్చువల్‌ మాధ్యమాల ద్వారా ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇక్కడ అబ్రహం లింకన్‌ ఆత్మ సందేశంతో కూడిన చిన్న మ్యూజియం ఉంది. సందర్శకుల కోసం ప్రత్యేకంగా హోటళ్లు, భోజనశాలలు ఉన్నాయి. కాబట్టి, ఆత్మల సంగతి ఎలా ఉన్నా, ఆత్మారాముడిని మాడ్చాల్సిన అవసరం రాదు.

Lily Dale
Lily Dale

1879లో స్థాపన

దేవుడు ఉన్నాడని నమ్మేవారంతా ఆత్మలూ ఉన్నాయని విశ్వసిస్తారు. ఆత్మలతో మాట్లాడే విద్య ఎప్పటి నుంచో ఉంది. మన దగ్గర చేతబడి, బాణామతి చేసే వారు సైతం ఆత్మలతో మాట్లాడతారని ప్రచారం. వారికి ఆత్మలను బంధించే శక్తి కూడా ఉంటుందని అంటారు. విశ్వంలో ఏ మూలన ఉన్నా సరే.. ఆ ఆత్మలను లాక్కొచ్చి మీతో మాట్లాడించగల సత్తా న్యూయార్క్‌లోని లిల్లీ డేల్‌ ఆవరణకు ఉంది. దీనిని 1879లో ప్రారంభించారు. ఇదొక చికిత్సా కేంద్రం. ఇక్కడ ప్రేతాత్మ బాధల నుంచి విముక్తి కలిగిస్తారు. ఇక్కడికి వచ్చేవారికి మానసిక సాంత్వన దొరుకుతుంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో ఇక్కడ ఆధ్యాత్మిక శిబిరాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో వేల మంది సందర్శకులు వస్తారు. ఈ సంఖ్య పెరగడం తప్పితే.. ఎప్పుడూ తగ్గలేదు. వివిధ దేశాల నుంచి వచ్చే సందర్శకులతో వేసవి శిబిరాలు కళకళలాడుతూ ఉంటాయి. దాదాపు 400 ఏండ్ల నాటి ఎన్నో భారీ వృక్షాలు నేటికీ సజీవంగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

ఆ ఐలాండ్‌లో మ‌హిళ‌ల‌దే రాజ్యం.. వాళ్ల‌దే పైచేయి.. మ‌రి పురుషులు ఏం చేస్తారు?

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండ‌వ్‌.. విజిల్‌తోనే పిలుచుకుంట‌రు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement