ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం | హిళలు కూడా పురుషులతో సమానమే. అన్నింట్లోనూ వాళ్లకు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలి.

మహిళలు కూడా పురుషులతో సమానమే. అన్నింట్లోనూ వాళ్లకు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలి. మహిళల సాధికారత కోసం కృషి చేయాలి.. అంటూ చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. అలాగే అవకాశాలు కూడా కల్పిస్తుంటాయి. కానీ.. ఓ ఐలాండ్‌లో మాత్రం మహిళలదే రాజ్యం.. వాళ్లు ఏం చెబితే అంత. అది ఏ పని అయినా సరే.. మహిళలే కనిపిస్తారు. అక్కడ మహిళలదే పైచేయి. ఎందుకు అలా మహిళలే అక్కడ రాజ్యమేలుతున్నారు. మరి.. మగవాళ్లు ఏం పనిచేస్తారు.. అనే విషయాలు తెలియాలంటే.. ఓసారి ఐలాండ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే.

యూరప్‌లోని ఎస్టోనియాలో దాదాపు 2000 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక ఐలాండ్ పేరు కిన్హు ఐలాండ్. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఈ ఐలాండ్ అందాలకు నెలవు. బీచ్, కొండలు, చెట్లు.. చుట్టూ ప్రకృతి అందాలే. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా.

అయితే.. ఇక్కడ మహిళల జనాభా ఎక్కువే.. వాళ్లు చేసే పనులు కూడా ఎక్కువే. ఐలాండ్‌లో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. మగవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. దానికి కారణం.. ఐలాండ్‌లోని మగవాళ్లు అందరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లడం. అక్కడ పురుషులు.. రోజు వారి పనులు చేయరు. నెలలకు నెలలు.. సముద్రంలోనే ఉంటారు. చేపలను వేటాడుతారు. దీంతో ఐలాండ్‌లో మహిళలే ఉండాల్సిన పరిస్థితి. దీంతో అన్ని పనులు వాళ్లే చక్కదిద్దుతారు అన్నమాట.

ఐలాండ్‌లో జరిగే పెళ్లిళ్ల దగ్గర నుంచి మనిషి చనిపోతే చేసే అంత్యక్రియల వరకు అన్నీ మహిళలే చూసుకుంటారు. డ్యాన్స్, పాటలు పాడటం, చేతి వృత్తుల పని, బిజినెస్, టూరిస్ట్ గైడ్.. ఇలా ప్రతి పని మహిళలే చేస్తారు. మగవాళ్లు అస్సలు ఈ పనులు చేయరు.

అయితే.. ఇది ఇప్పుడు ప్రారంభమైన ఆచారం కాదు.. తమ అమ్మమ్మల కాలం నుంచి ఇదే ఆచారం అక్కడ కొనసాగుతోందట. అదే ఆచారాన్ని ఈ జనరేషన్ మహిళలు కూడా కాపాడుకుంటూ వస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
Oxygen on Moon | చంద్రుడిపై ఆక్సిజన్.. 800 కోట్ల మంది లక్ష ఏండ్లు ఈజీగా బతికేయొచ్చు
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
Petrol Pumps : పెట్రోల్ బంక్‌ల వద్ద సెల్‌ఫోన్స్ ఎందుకు వాడకూడదు? వాడితే ఏమౌతుంది?
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

