Migraine | ఆఫీస్‌లో మైగ్రేన్ సమస్యలా..? ఈ టిప్స్ పాటించండి!
మైగ్రేన్ ఒకరకమైన తలనొప్పి. అది నరాల రుగ్మత. తరచుగా వేధిస్తూ, తట్టుకోనేంత బాధిస్తుంది. తలలో ఓ వైపు మాత్రమే వేధిస్తుంది. తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువ. అనవసరపు ఆలోచనలతో గతం గురించి తీవ్రంగా ఆలోచించేవారికి ఈ సమస్య రావచ్చు. నిద్రలేమి, డిప్రెషన్, ఎక్కువసేపు ఎండలో ఉండటం, మహిళల్లో బహిష్టుకు ముందు లేదా తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
మైగ్రేన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం, ప్రపంచంలో కోటి మందికి పైగా మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. దీని వల్ల వచ్చే తలనొప్పిని ఇంట్లోనైతే ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు. అదే ఆఫీసులో ఐతే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పని చేస్తున్నప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది.
హెల్త్‌లైన్ వెబ్సైట్ నివేదిక ప్రకారం, 90 శాతం మంది మైగ్రేన్ రోగులు తలనొప్పి వచ్చినప్పుడు సరిగ్గా పని చేయలేకపోతున్నారు. ఈ వ్యాధి కనిపించదు. అందుకని చుట్టుపక్కల వారికి ఆ రోగి బాధను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
యజమానికి వివరించాలి..
మైగ్రేన్ నొప్పి కనిపించదు. చెబితే తప్ప ఎదుటి వారికి తెలియదు. ఆఫీసులో బాస్, హ్యూమన్ రిసోర్స్ సిబ్బందితో మీరు ఎదుర్కొంటున్న సమస్యను వివరించండి. మైగ్రేన్ దాడి కారణంగా ఎంత ఇబ్బందిపడుతున్నారో వారికి చెప్పండి. వారు మీ సమస్యను అర్థం చేసుకోని పక్షంలో, డాక్టర్ ఇచ్చిన సలహాలను వారికి చూపి సాయం పొందండి.
ప్లాన్ ముఖ్యం..
ఆఫీసులో మైగ్రేన్ దాడులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక చాలా ముఖ్యం. ఎలాంటి సమస్య లేనప్పుడు టార్గెట్ కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టండి. మీ స్థానంలో పని చేయడానికి సహోద్యోగుల సహాయం తీసుకోండి. ఇంటికి వెళ్లేటప్పుడు ఆటో లేదా టాక్సీ సురక్షితమైనవని మరిచిపోకండి.
వీటికి దూరంగా ఉండాలి..
ప్రకాశవంతమైన లైట్లు, శబ్దాలు, బలమైన వాసనలు మీ క్యాబిన్ పరిసరాల్లో లేకుండా చూసుకోండి. కంప్యూటర్ మానిటర్ కాంతి తక్కువగా ఉంచుకోండి. డెస్క్ లైట్ కూడా తక్కువగా ఉండేట్లు చూడండి. అవసరమైతే మేనేజర్‌తో మాట్లాడి మరో చోటికి మీ డెస్క్‌ను తరలించుకోండి. అలాంటి ప్రాంతం లేకపోతే.. చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని శబ్దాలను నివారించుకోవాలి. పెర్ఫ్యూమ్లను వాడే సిబ్బందికి దూరంగా ఉండండి.
ఒత్తిడిని నివారించాలి..
ఆఫీసులో పని గురించి ఆందోళన సహజమే. అయినప్పటికీ నిరంతరం ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.ఆఫీసులో ఒత్తిడిని నివారించుకోవడానికి 5-10 నిమిషాల చొప్పున విరామం తీసుకోవాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయవచ్చు లేదా బయట నడవవచ్చు.
ఎస్కేప్ గదిని కనుక్కోవాలి..
ఆఫీసులో పనిలో ఉండగా అనారోగ్యంగా అనిపిస్తే ఒంటరిగా కాస్సేపు గడిపేందుకు ఆఫీసులో ఒక గదిని గుర్తించండి. మైగ్రేన్ లక్షణాలు కనిపించిన సమయాల్లో ఈ గదిలో కాస్త విశ్రాంతి తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చు.
ఆఫీసులోనూ మందులు..
మైగ్రేన్ ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని మీ డెస్క్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. దీనిలో అవసరమైన అన్ని మందులు పెట్టేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్, ఆకలిని నివారించేందుకు అదనపు నీటి సీసాలు, ఆహార పదార్థాలు అందుబాటులో పెట్టుకోవాలి. లో బీపీకి ఉపయోగపడే కొన్ని స్నాక్స్‌ను డెస్క్‌లో దాచిపెట్టుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

