Cashkaro Co Founder Swati Bhargava | ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే శారీరక, మానసిక సమస్యల్ని అధిగమించేందుకు యోగా, ప్రాణాయామం సాధన చేయాలని సలహా ఇస్తారు ఫిట్నెస్ నిపుణులు. కూపన్లు, క్యాష్‌బ్యాక్‌లను అందించే ‘క్యాష్‌కరో ( Cashkaro )’ సంస్థ సహ-వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ ( Swati Bhargava ) కూడా యోగా తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని చెబుతారు.
“రెండు దశాబ్దాల క్రితం యోగా.. నా జీవితంలోకి ప్రవేశించింది. అప్పుడు నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్నా. ఆ సమయంలోనే నాకు చర్మ సంబంధమైన సమస్య వచ్చింది. అమ్మ యోగా టీచర్. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయమని సలహా ఇచ్చింది. యోగ సాధనలో మన శరీరంలోని కణకణంలోకి ప్రాణశక్తి ప్రవహించడాన్ని గమనిస్తాం. నెమ్మదిగా చర్మవ్యాధి దానంతట అదే తగ్గిపోయింది. నా జీవితం కొత్తగా ప్రారంభమైంది. ఇప్పటికీ రోజూ ఉదయాన్నే ప్రాణాయామంతోపాటు సూర్యనమస్కారాలు, యోగా చేస్తాను. నేను రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి ఈ ఎనర్జీ ఎంతగానో ఉపయోగపడుతుంది” అని వివరించారు స్వాతి.
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”