Brass Jewelry | ఇత్తడి అనగానే పెద్దపెద్ద గంగాళాలే గుర్తొస్తాయి. కానీ, బంగారు వన్నెలో పచ్చగా మెరిసిపోయే ఇత్తడితో మగువలు మెచ్చే ఆభరణాలనూ తయారు చేస్తున్నారు. మన్నికలో వీటికి తిరుగు లేదు. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టే, ఇత్తడి నగలకు ఎనలేని ఆదరణ లభిస్తున్నది.
ఇత్తడి ప్రత్యేకతలు ఇత్తడివే. రంగుకేం తక్కువ లేదు. దాదాపుగా బంగారమే! నాజూకుగా కనిపించినా దృఢమైన లోహమే. మన్నిక ఎక్కువ. ధర అతి సామాన్యం. పాపిట బిళ్ల నుంచి వడ్డాణం వరకు ప్రతి నగనూ ఇత్తడితో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మహిళలు బంగారు నగలే ధరించేవారు. కాలం మారింది. బంగారమా, మరొకటా అన్నది పట్టించుకోవడం లేదెవరూ. ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు. ఏ లోహాన్ని అయినా ఇష్టపడుతున్నారు. సందర్భాన్ని బట్టి, ధరించే దుస్తులకు నప్పేలా.. రోజుకో నగ ధరిస్తున్నారు. ఆ మాటకొస్తే.. బంగారంతో పోలిస్తే ఇత్తడి ఆభరణాల్లోనే డిజైన్లు ఎక్కువ. త్రీడీ ప్రింటింగ్ నగలూ వచ్చేశాయి. హ్యాండ్ మేడ్ ఇత్తడి ఆభరణాలకు మరింత ఆదరణ ఉంది. ప్రత్యేక సందర్భాలలో అమ్మాయిలు ఒంటి నిండా నగలు ధరించాలని కోరుకుంటారు. అన్నిసార్లూ స్వర్ణాభరణాలతో సింగారించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు, ఇత్తడి నగలు ఆ ముచ్చట తీరుస్తున్నాయి. ముదితల మనసు దోచేస్తున్నాయి.
“Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా”
“Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
“సన్నని నడుముకు వన్నెల గొలుసు.. మళ్లీ ట్రెండింగ్ అవుతున్న ఓల్డ్ స్టైల్”