Holi Celebrations | రంగుల పండుగ హోలీ వచ్చేసింది. ఇంటిల్లిపాదీ సప్తవర్ణాల లోకంలో విహరించే సమయం ఇది. ఆ సంతోషాల వేడుకలో హానికర రసాయనాలు చర్మానికి, జుట్టుకు నష్టం కలిగించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి.
♦ ఎండలో వెళ్లడానికి ఇరవై నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. అవి మాయిశ్చ రైజర్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా ముఖంపై రంగులు పడినా పెద్దగా హాని జరగదు. హోలీ తర్వాత కూడా చర్మం పొడిబారినట్టు ఉంటే సన్‌స్క్రీన్ ప్యాక్ ప్రయత్నించండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లయ్ చేయండి.
♦ ఒంటిమీది రంగులు శుభ్రం చేసుకునేటప్పుడు ముఖాన్ని సబ్బుతో కడగవద్దు. దీనివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. సబ్బుకు బదులుగా క్లెన్సింగ్ క్రీమ్, లోషన్ ఉపయోగించడం ఉత్తమం. వాటిని ముఖానికి రాసుకున్న తర్వాత తడి దూదితో మెత్తగా తుడవాలి.
♦ హోలీ తర్వాత చర్మం పూర్వస్థితికి రావడానికి ఒక చిట్కా ఉంది. కప్పులో సగం వరకూ పాలు పోసుకుని అందులో నువ్వుల నూనె వేసి, బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. లేదంటే అరకప్పు పెరుగులో రెండు చెంచాల తేనె కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
♦ కృత్రిమ రంగులతో హోలీ ఆడేటప్పుడు జుట్టుపై శ్రద్ధ పెట్టాలి. మైకా, సీసం వంటి రసాయనాలు కేశాలకు హాని కలిగిస్తాయి. హోలీకి ముందు జట్టుకు హెయిర్ సీరమ్ రాసుకోండి. ఇది రసాయన రంగులు, కాలుష్య కారకాలు, సూర్యరశ్మి నుంచి వెంట్రుకలను కాపాడుతుంది.
♦ వేడుక తర్వాత జుట్టును శుభ్రం చేసే ముందు ఒక కప్పు నీటిలో నిమ్మరసం కలిపి మృదువుగా మసాజ్ చేయాలి. ఇది జుట్టు మొదళ్లలో యాసిడ్ ఆల్కలిన్ను పునరుద్ధరించడానికి చాలా ఉపయోగపడుతుంది.
♦ బీర్ పానీయాన్ని కూడా జుట్టును శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. బీరులో నిమ్మరసం కలిపి, షాంపూ పెట్టిన తర్వాత తలకు పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. కురులు మునుపట్లా నిగనిగలాడుతాయి
Holi | తెలంగాణలో హోళీ ఎందుకంత ప్రత్యేకమో తెలుసా!”
“ఈ ఊరికి అల్లుడైతే.. హోలీ రోజు గాడిద ఎక్కాల్సిందే..!!”