మీది రింగుల జుట్టా? అందరూ వాడే షాంపూలు, హెయిర్ క్రీమ్‌ల కారణంగా లేనిపోని సమస్యలు వస్తున్నాయా? అయితే మీలాంటి వారికోసమే మార్కెట్లోకి వచ్చింది ‘ఫిక్స్ మై కర్ల్స్ ( Fix My Curls )’. వారణాసికి చెందిన అన్షిత ( Anshita Mehrotra ) ఉంగరాల జుట్టువారే లక్ష్యంగా ఈ సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేసింది.
మీకు తెలుసా? ప్రపంచ జనాభాలో 60 శాతం మంది ఉంగరాల జట్టువారే. తమకంటూ ప్రత్యేకమైన షాంపూ, హెయిర్ క్రీమ్ లేకపోవడంతో వాళ్లంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టుకు సరైన పోషణ అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారిలో కర్లీ బ్యూటీ.. అన్షిత ఒకరు. తన రింగుల జుట్టును కాపాడుకునేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి విసుగొచ్చి ‘ఫిక్స్ మై కకర్ల్స్’ ఉత్పత్తులకు ప్రాణంపోసింది. అమెరికా, పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ వరల్డ్ క్యాంపస్‌లో జర్నలిజం చేసిన అన్షిత.. హర్యానా ప్రభుత్వం నుంచి ‘బెస్ట్ ఆంత్రప్రెన్యూర్’ అవార్డు అందుకుంది. వ్యాపారం పెరుగుతుండటంతో సొంతంగా హెయిర్ సెలూన్ చైన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో తన బ్రాండ్‌ను విస్తరించాలన్నది వ్యూహం.
“తమిళనాడులోని గిరిజనులకు అండగా నిలిచిన మహబూబాబాద్ కుర్రాడు.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..”