ఫ్రెంచ్ షెఫ్‌లకే చీఫ్ మన హైదరాబాదీ కుర్రాడు
Hyderabadi Chef Varun Shahani | ప్రపంచం నలుమూలలా తెలంగాణ బిడ్డలు ఉన్నారు. తమదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. షెఫ్ వరుణ్ సహానీ కూడా అంతే. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ‘రిలైస్ అండ్ చాటేక్స్’ సమావేశంలో ఫ్రెంచ్ షెఫ్‌లకు నాయకత్వం వహించి.. హైదరాబాద్ సత్తా చాటాడు.
హైదరాబాద్‌కు చెందిన వరుణ్ సహానీ ( Varun Shahani ) పాకశాస్త్ర నిపుణుడు. కిచెన్ ల్యాబ్‌లో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. అతని చేతి వంటలు రుచిచూసి మహామహా షెఫ్‌లు సైతం ‘ఔరా ఏమి రుచి.. తిన్నాం మైమరచి’ అంటూ కితాబిచ్చారు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. న్యూయార్క్‌లోని ‘జీన్ జార్జెస్ ఆఫ్ రెస్టారెంట్స్’ గొలుసుకట్టు భోజన శాలకు చాలా పేరుంది. అమెరికాలోని అత్యత్తమ ఫ్రెంచ్ రెస్టారెంట్ల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా రెస్టారెంట్లలో టాప్-100లో చోటు దక్కించుకుంది. ఇక్కడ కొన్ని వందల మంది పాక నిపుణులు పనిచేస్తారు. సదరు హోటల్ వార్షికోత్సవం ‘రిలైస్ అండ్ చాటేక్స్’ పేరిట ఏటా ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్లో జీన్ జార్జెస్ రెస్టారెంట్లలో పనిచేసే ఉద్దండులైన షెఫ్‌లకు మన వరుణ్ సహానీ నాయకత్వం వహించాడు.

నోరూరించే రుచులు..
జీన్ జార్జెస్ రెస్టారెంట్ నిర్వహించే ‘రిలైస్ అండ్ చాటేక్స్’ ఈవెంట్‌కు హాజరు కావడం షెఫ్‌లకు ఓ గౌరవం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పాక నిపుణులంతా ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారు. ఈ మీట్లో నోరూరించే కొత్త రుచులతో ఓ సరికొత్త ట్రెండ్‌కు పునాదులు వేశాడు వరుణ్. పళ్లాల నుంచి మెనూ వరకు అన్నీ వెరైటీగా ఉండేలా చూశాడు. తనదైన వినూత్న ఆవిష్కరణ ‘కానాపేస్’ను ప్రధాన వంటకంగా చేర్చాడు. దానికి షాంపైన్‌ను జతచేయడంతో.. రుచి అదిరిపోయింది. వరుణ్‌ను అంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఓ గ్లోబల్ ఈవెంట్లో భారతీయ షెఫ్‌కు ఇంత గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.

సీఏ వదులుకొని..
వరుణ్ తండ్రి హైదరాబాద్‌లోని వివిధ రెస్టారెంట్లలో క్యాటరింగ్ విభాగంలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. ఇంట్లో రుచికరమైన భోజనం వండిపెట్టేవారు. వరుణ్ వంటింట్లో తల్లికి సాయం చేసేవాడు. కూరగాయలు తరగడం, మసాలా దినుసులు నూరుకోవడం.. అమ్మ దగ్గరే నేర్చుకున్నాడు. తన ఆసక్తిని పక్కనపెట్టి తల్లిదండ్రుల కోసం సీఏ చదివాడు. కానీ చివరికి పాకశాస్త్రం వైపే మొగ్గు చూపాడు. ఆరునూరైనా షెఫ్‌గా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్స్‌తో వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. న్యూయార్క్‌లోని ‘కలినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా’లో చదవాలన్నది తన ఆశ. అక్కడ ప్రవేశం దొరకడం చాలా కష్టం. వరుణ్‌ను ఆ అవకాశం సులభంగానే వరించింది. ఆ సమయంలో జీన్ జార్జెస్ రెస్టారెంట్లో ఇంటర్న్‌షిప్ చేశాడు. పట్టా చేతికొచ్చాక జీన్ యాజమాన్యమే పిలిచి కొలువు ఇచ్చింది.

వరుణ్ అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. వీటితోపాటుగా ఫుడ్ వీడియోలను రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ‘మనం పోటీ ప్రపంచంలో జీవిస్తున్నాం. ప్రపంచ
వ్యాప్తంగా షెఫ్‌లు కొత్త వంటకాలు సృష్టించడానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. నేనూ అంతే. నా మట్టుకు నేను శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నాను’ అంటున్నాడు వరుణ్. రాబోయే
ఐదేళ్లలో తనకంటూ ఓ సొంత రుచుల సంస్థను స్థాపించుకోవడం తన లక్ష్యం. అయినా అదెంతపని? ఆ నలభీముడి కోసం పెట్టుబడులు పెట్టడానికి చాలామందే సిద్ధంగా ఉన్నారు.
Read More :
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- chef
- Hyderabad
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

