Young Chefs | వంట అందరికీ చేతకాదు. అదొక కళ! వంట చేయడం తెలియక ఉపవాసం ఉండేవాళ్లనూ చూస్తుంటాం. దావత్ అయినా, శుభకార్యం అయినా భోజనమే కీలకం. నోరూరించే వంటలను సృష్టిస్తూ.. నలభీములుగా పేరుపొందిన యువ చెఫ్‌ల గురించి తెలుసుకుందాం!
ప్రతీక్ సాధు: ముంబైకి చెందిన ప్రతీక్ సాధు ఆరేండ్ల క్రితం.. ప్రముఖ రెస్టారెంట్లో చీఫ్ చెఫ్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందాడు. గత మార్చిలో ఉద్యోగం వదిలేసి దేశ విదేశాల్లో పాప్-అప్ ఈవెంట్స్ చేస్తున్నాడు. గడ్డిలో పొగబెట్టి వండే మంచినీటి చేపల కశ్మీరీ వంటకంలో ఆరితేరాడు. క్విన్స్ జెల్లీ పండుతో ఐస్‌క్రీమ్ తయారుచేసి విదేశాలకూ పరిచయం చేశాడు.
మేఘా కోహ్లి : గురుగ్రామ్‌కు చెందిన మేఘా కోహ్లి ‘ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్’లో ట్రైనీగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత బెంగాలీ-ఆర్మేనియన్ రెస్టారెంట్ ‘గొరాయ్’లో చెఫ్ హోదా పొందింది. వివిధ వంటకాలను తన దైన శైలిలో పరిచయం చేయాలనే కోరికతో గొరాయ్ నుంచి బయటికి వచ్చి విశ్వ కుబేరులకు తన కొత్త రుచులను వడ్డిస్తున్నది.
దిర్హమ్ హక్ : ఢిల్లీకి చెందిన దిర్హమ్.. బరాక్ ఒబామా, జార్జ్ బుష్, వ్లాదిమిర్ పుతిన్ సహా దాదాపు 45 మందికిపైగా దేశాధినేతలకు వ్యక్తిగత చెఫ్‌గా పనిచేశాడు. తను ఐటీసీ మౌర్యలో కెరీర్ ప్రారంభించాడు. బెంగళూరులోని ‘ఫోర్ సీజన్స్’లో ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా చేస్తున్న హక్.. ఇరాక్, పోలాండ్, దుబాయ్ వంటి దేశాల వంటకాలు చేయడంలో నేర్పరి.
నియతీ రావు : ముంబైలోని ‘ఎకా రెస్టారెంట్’ యజమాని. దాదర్ క్యాటరింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసింది. కొపెన్ హాగన్లోని ‘పురాణ నోమా’లో కెరీర్ ప్రారంభించింది. తాజ్ మహల్ ప్యాలెస్ దగ్గర వాసబి రెస్టారెంట్లో చెఫ్‌గా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నియతి.. ఫ్రెంచ్ రెస్టారెంట్ ‘జోడియాక్ గ్రిల్’ ద్వారా ఫేమస్ అయ్యింది.
రాహుల్ గోమ్స్ పెరీరా : గోవాకు చెందిన రాహుల్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. గోవా వంటకం చోరిజో తయారీలో ఎక్స్పర్ట్. ‘పికు’,‘ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్’, ‘బాంబే క్యాంటీన్’ వంటి రెస్టారెంట్స్‌లో చెఫ్‌గా చేశాడు. నానమ్మ దగ్గర నేర్చుకున్న వంట కాలతో గోవాలో ఓ రెస్టారెంట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తనకో కిచెన్ ల్యాబ్ ఉంది.
హిమాన్షు సైని : ఢిల్లీకి చెందిన హిమాన్షుకు బాల్యం నుంచీ వంటగదితో అనుబంధం ఉంది. వాళ్లింట్లో 50 మందికిపైనే ఉండేవాళ్లు. నానమ్మ, పిన్ని, అత్తమ్మలు వంట చేస్తుంటే హిమాన్షు సాయం చేసేవాడు. ఒక రెస్టారెంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీగా కెరీర్‌ను ప్రారంభించిన హిమాన్షు అంచెలంచెలుగా ఎదిగి దుబాయ్‌లో రెస్టారెంట్‌ను నెలకొల్పే స్థాయికి వచ్చాడు.
హుస్సేన్ షాజాద్: ముంబైకి చెందిన షాజాద్ ‘హంగర్ ఇంక్’ రెస్టారెంట్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్. మణిపాల్ హాస్పిటాలిటీ స్కూల్లో శిక్షణ పూర్తిచేసిన షాజాద్ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌కు వ్యక్తిగత వంట నిపుణుడిగా చేశాడు. న్యూయార్క్‌లోని మాడిసన్ పార్క్‌లో చెఫ్‌గా పనిచేశాడు. పోర్చుగల్, టర్కీ వంటల్లో నిపుణుడు. బాంబే క్యాంటీన్ ద్వారా ఫేమస్ అయ్యాడు.
వినేష్ జానీ: బెంగళూరుకు చెందిన వినేష్ జానీ చాక్లెట్ తయారీ నిపుణుడు. బెంగళూరులోని లవొన్నె అకాడమీ ఆఫ్ బేకింగ్ సైన్స్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్ సహ వ్యవస్థాపకుడు కూడా. ఇది దేశంలో పేరున్న పేస్ట్రీ స్కూల్స్‌లో ఒకటి. విదేశాల్లో శిక్షణ తీసుకొని ప్రపంచ ప్రసిద్ధుడు అయ్యాడు జానీ. మరిన్ని ప్రయోగాలు చేసి రికార్డు సృష్టించాలనేది అతని లక్ష్యం.
Bala latha | సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి అండగా మారిన బాలలత స్టోరీ ఇదీ..”
Nawabs Kitchen | గరీబోళ్ల ఆకలి తీరుస్తున్న నవాబ్స్ కిచెన్”
“Animall | పశువుల కోసం మాల్ స్టార్ట్ చేసిన ఇద్దరమ్మాయిలు”
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!”