కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది
Chef Priya Bhupal | బేకరీ రుచుల్ని చాలామందే ఇష్టపడతారు. కానీ, ఆమె మాత్రం వాటి తయారీని ఇష్టపడింది. రకరకాల ప్రయోగాలు చేసింది. వేల్స్ విశ్వవిద్యాలయం ఇచ్చిన బిజినెస్ మేనేజ్మెంట్ పట్టాను పక్కన పెట్టి, బహుళ జాతి సంస్థలో వచ్చిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ఉద్యోగాన్ని వదులుకుని.. రుచుల ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రపంచమంతా చుట్టేసి బేకింగ్‌లో రకరకాల కోర్సులు చేసింది. కుటుంబ బాధ్యతలకు న్యాయం చేస్తూనే తన ఆంత్రప్రెన్యూర్‌షిప్ కల నిజం చేసుకుంది. ఆ ప్రయాణమంతా షెఫ్ ప్రియా భూపాల్ మాటల్లోనే..
నేను పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఐపీఎస్ అధికారి. అమ్మ కేక్స్ బాగా చేసేది. తను చేసింది తినడమే కానీ, నేనెప్పుడూ ప్రయత్నించలేదు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్లో ఎంబీఏ చదివాన్నేను. అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ, భారత్‌లోనే స్థిరపడాలన్న ఉద్దేశంతో తిరిగి వచ్చేసి.. ఓ బహుళజాతి సంస్థలో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా చేరాను. తర్వాత పెండ్లయింది. అంతలోనే నన్ను సింగపూర్ బదిలీ చేశారు. కానీ, మా ఆయనకు ఇక్కడ వ్యాపారం ఉంది. దీంతో ఉద్యోగం వదులుకుని ఇంటిపట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. మాకు ముగ్గురు పిల్లలు. నాకు మా అమ్మ ఎలా కేక్స్ చేసిపెట్టేదో నేనూ నా పిల్లలకు అలానే చేసిపెట్టాను. కప్ కేక్స్, బ్రౌనీస్ బాగా చేసేదాన్ని. అంతా మెచ్చుకునేవాళ్లు. ప్రియ అంటేనే టేస్టీ కేక్స్ అన్నంత పేరు వచ్చింది. టీవీలో వంటల కార్యక్రమాలు చూస్తూ రకరకాల కేకులు చేసేదాన్ని. యూట్యూబ్ వచ్చాక చాలా ప్రయోగాలు చేశాను. అలా వంటలపట్ల నా ఆసక్తి అభిరుచిగా మారింది. ప్రొఫెషనల్ స్థాయికి ఎదగాలన్న కోరిక బలపడింది.

పిల్లలకు దూరంగా
నేను చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే, పెండ్లయిన తర్వాత ఆడవాళ్లకు చదువు విషయంలో పెద్దగా సపోర్ట్ దొరకదు. నాకు మాత్రం విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. లండన్‌లో ‘లా కార్డన్ బ్లూ’ అనే కలినరీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరాను. కేక్ డెకరేషన్ కోర్స్ చేశాను. నేను లండన్ వెళ్తున్న సమయానికి మా పెద్దబ్బాయి వయసు ఏడేండ్లు. మిగిలిన ఇద్దరి (కవలలు) వయసు రెండేండ్లు. పిల్లల్ని మా అత్తగారు, అమ్మానాన్న చూసుకున్నారు. మా ఆయన కూడా, ఎంత బిజీగా ఉన్నా పిల్లలపట్ల శ్రద్ధ తీసుకునేవారు.

నాలుగు దేశాల్లో చదువు
లండన్ నుంచి వచ్చిన కొన్నాళ్లకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలినరీ ఎడ్యుకేషన్ (న్యూయార్క్)లో చదువుకోవడానికి అమెరికా బయల్దేరాను. అది పూర్తిచేసిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లాను. ప్రతి కోర్సూ ఓ సవాలే. రోజూ పద్నాలుగు గంటలు క్లాసులు ఉండేవి. కిచెన్ శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అమ్మ చాటు బిడ్డగా పెరిగిన నాకు ఇదంతా కష్టంగానే అనిపించింది. కానీ పట్టుదలతో చేశాను. నేర్చుకోవాలన్న తపనే కానీ, వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన మొదట్లో లేదు. అయితే, కోర్స్ సర్టిఫికెట్ సంపాదించాలంటే అకడమిక్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. మార్కెట్లో మనల్ని మనం నిరూపించుకోవాలి. అందుకు మూడు నెలలపాటు ఏదైనా బేకరీలో ఇంటర్న్‌షిప్ చేయాలి. కస్టమర్స్‌ను మెప్పిస్తేనే సర్టిఫికెట్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ కోసం బార్సిలోనా (స్పెయిన్) వెళ్లాను. నైపుణ్యం పెరిగాక సొంతంగా ఓ బేకరీ ప్రారంభించాలన్న ఆలోచన బలపడింది. కానీ పిల్లలు చిన్నవాళ్లు. అప్పటికే చాలాకాలం దూరంగా ఉన్నాను. దీంతో ఆ ప్రతిపాదన పక్కనపెట్టి మూడేండ్లపాటు వాళ్లను చూసుకున్నాను. ఆ సమయంలోనూ కిచెన్‌లో ప్రయోగాలు ఆపలేదు. అదంతా చూసి మా ఆయన రామ్, ఇంట్లోవాళ్లు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టమని గట్టిగానే సలహా ఇచ్చారు. పిల్లలు తమ పనులు తాము చేసుకోగలరన్న నమ్మకం కలిగాక.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ 63ఏ లేన్‌లో spero patisserie పేరుతో బేకరీ స్టార్ట్ చేశాను. దాదాపు యాభై రకాల ఐటమ్స్ అందిస్తాం. చాలామంది ఇష్టపడుతున్నారు. ఎక్కడికి పోయినా మీరు ఫలానా కదా అని గుర్తుపట్టేస్తున్నారు. ఓ ప్రొఫెషనల్‌గా ఇదో‘తీయని’ అనుభవం.
Read More :
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- chef
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

