అమెరికాలో.. ఇండియా రుచులు
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఒక్క భారతీయుడినైనా తప్పక కలుస్తాం. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయుల సంఖ్య అమెరికాలో మరీ ఎక్కువ. అందుకే అక్కడ మన ఆహారానికి భలే గిరాకీ. అలాంటి వాళ్ల కోసం భారతీయ భోజనాన్ని అందిస్తూ డాలర్ల దేశంలో ‘ఇండియన్ కలినరీ ఐకన్'గా గుర్తింపు పొందారు ఆర్తి సంపత్
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఒక్క భారతీయుడినైనా తప్పక కలుస్తాం. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయుల సంఖ్య అమెరికాలో మరీ ఎక్కువ. అందుకే అక్కడ మన ఆహారానికి భలే గిరాకీ. అలాంటి వాళ్ల కోసం భారతీయ భోజనాన్ని అందిస్తూ డాలర్ల దేశంలో ‘ఇండియన్ కలినరీ ఐకన్’గా గుర్తింపు పొందారు ఆర్తి సంపత్. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా భారతీయ రుచుల్ని ప్రపంచం నలుమూలలకూ విస్తరిస్తున్న వాళ్లను గౌరవిస్తూ చెఫ్ వికాస్ ఖన్నా నేతృత్వంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ఓ జాబితాను విడుదల చేసింది. అందులో ఆర్తికి ప్రత్యేక స్థానం ఇచ్చారు.
‘మనం కనుక మన ప్రత్యేకతల్ని విస్తరించకపోతే వాటిని ఇంకెవరో తన్నుకుపోయే ప్రమాదం ఉంది. నేను అమెరికాకు వచ్చిన కొత్తలో యోగా గురువులుగా విదేశీయులే ఎక్కువగా కనిపించేవారు. ఇండియన్ రెస్టారెంట్లను నడుపుతున్న వాళ్లూ విదేశీయులే. అందుకే నేను అచ్చమైన భారతీయ రుచుల్ని పరిచయం చేయాలని నిర్ణయించా. న్యూయార్క్‌లో ఎలివేటెడ్ లేదా మోడ్రన్ ఇండియన్ క్యుజిన్ అనే మాట బాగా పాపులర్ అవుతున్నది. భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. అందులో మోడ్రన్ అనే పదాన్ని జోడించడంలో అర్థం లేదు. నా మటుకు నేను మా అమ్మ, అమ్మమ్మలు వండిన వంటల్ని కాస్త కొత్త టెక్నిక్‌తో ప్రయత్నిస్తానంతే. వాటి రుచి మహాద్భుతం. నోస్టాల్జియా వంటలకు ఏవీ సాటిరావు. నా వంటలన్నీ పాత రుచుల్ని గుర్తుకు తెచ్చేవే’ అంటారామె. నిజమే ఆవకాయలాంటి రుచి నోటికి తగిలాక ఎన్ని పిజ్జాలు, బర్గర్లు తిన్నా ‘అబ్బే..’ అనే అనిపిస్తుంది!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

