hire a chef | టైం చెప్తే చాలు.. ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ ఇంటికొచ్చి వంట చేసి వెళ్తాడు
hire a chef | అందరికీ రెస్టరెంట్ రుచులు అలవాటై పోయాయి. వారానికోసారి అయినా బయటి విందుకు వెళ్లాల్సిందే. కానీ, కరోనాతో ఆ సంప్రదాయానికి తెరపడింది. జనమూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం రెస్టరెంట్‌కు వెళ్లడం కాదు, రెస్టరెంటే మన వద్దకు వస్తే? అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే.. ‘ బుక్ యువర్ షెఫ్ ( Book your chef )’, ‘ హైర్ ఎ షెఫ్ ( Hire a chef )’ తరహా వ్యాపార ఆలోచన. ఒక్క క్లిక్ చాలు..నలభీములే మన గడప తొక్కుతారు. ఫైవ్ స్టార్ భోజనం వండి వడ్డిస్తారు.

తేదీ.. సమయం.. అతిథుల సంఖ్య.. వంటల జాబితా.. వగైరా వివరాలు ఆన్లైన్లో నింపి, నిర్ణీత మొత్తం చెల్లిస్తే చాలు. ఆ సమయానికంతా మనింటి ముందు ఓ వ్యాన్ ఆగుతుంది. అందులోంచి మాస్టర్ షెఫ్ దిగుతాడు. అనుచర గణమూ ప్రత్యక్షం అవుతుంది. పిల్లల పుట్టిన రోజు అయితే.. చిన్నారుల వంటలకూ ప్రత్యేకంగా షెఫ్‌లు ఉంటారు. ఏం వండాలన్న దాన్ని బట్టే.. షెఫ్‌లు వంట సామగ్రిని మనింటికి తీసుకొస్తారు. ఆ ఖర్చులన్నీ అదనం. షెఫ్‌ను ఎంచుకుంటున్నప్పుడే ఎంతమందికి వండాలన్న విషయాన్ని తెలపాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అతిథుల సంఖ్య పెరిగితే, ఆ సంగతి కూడా సాధ్యమైనంత త్వరగా చెప్పాలి. కొన్ని వంటకాలకు రెండు మూడు గంటల ముందే పదార్థాలను నానబెట్టడం లాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ల సాయంతో ఆ పనీ చేసిపెడతారు. కాకపోతే ధరలూ పంచ నక్షత్రాల స్థాయిలోనే ఉంటాయి.
ఉదాహరణకు టేక్ఎషెఫ్.కామ్ ఇద్దరికి వండటానికి తలా ఆరు వేల రూపాయల వరకూ చార్జ్ చేస్తుంది. జనం పెరిగేకొద్దీ చార్జీలూ తగ్గుతాయి. అదే పదమూడు మందిని దాటితే తలా మూడువేలు వసూలు చేస్తారు. డబ్బు కంటే.. సొంతింట్లో ఫైవ్ స్టార్ సౌఖ్యమే ముఖ్యమని అనుకొనేవారు నిరభ్యంతరంగా పాక నిపుణుడిని బుక్ చేసుకోవచ్చు. వ్యాపారవేత్తలూ, సినిమా తారలూ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకొంటున్నారు. ఇక్కడే ‘సర్ప్రైజ్ మీ’ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే.. విందులో ఏదో ఓ ఆశ్చర్యకరమైన వంటకం ఉండి తీరుతుంది.
ఈ ట్రెండ్ బాగుంది..
“నేను మొదట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని. కానీ, పాకశాస్త్రం అంటే నాకు ప్రాణం. తాజ్ బెంగళూరులో కాంటినెంటల్ కుకింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. అప్పటి నుంచీ రకరకాల చోట్ల షెఫ్‌గా చేస్తున్నాను. హైదరాబాద్‌లోనూ ‘టేక్ ఎ షెఫ్’ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్నించి ఇక్కడే పని చేస్తున్నాను. కస్టమర్ల ఇంటికి వెళ్లడం, అక్కడ వంట చేసి రావడం చాలా బాగుంటుంది. కొందరు ప్రత్యేక ఆతిథ్యంతో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇంటి మనిషిలా చూసుకుంటారు. మరికొందరు నేను వంట చేసేటప్పుడు వచ్చి చిన్నచిన్న చిట్కాలు అడుగుతూ ఉంటారు. ఒకటి రెండు వంటలు కూడా నేర్చుకుంటారు” అని చెబుతున్నాడు షెఫ్ సంతోష్ హెగ్డే.
లాభదాయకమే
“కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు అందరితోపాటు మా హోటల్‌నూ చాలారోజులు మూసేశాం. అయితే మా మాస్టర్ షెఫ్‌ల సలహా ప్రకారం, ప్రైవేట్ షెఫ్ పద్ధతిని ప్రారంభించాం. కస్టమర్లు ఏం కావాలన్నది మా యాప్‌లో ఎంచుకోవచ్చు. అలాగే మా షెఫ్‌ల పేర్లు, వాళ్ల అర్హతలతో పాటు.. ఏ వంటకాల్లో వారికి ప్రావీణ్యం ఉందన్నదీ ఆన్లైన్లో ఉంచుతాం. ఈ ట్రెండ్ వల్ల హోటల్, షెఫ్, కస్టమర్లు.. ముగ్గురికీ లాభదాయకంగా ఉంటున్న ది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. కస్టమర్ల ఇంటికెళ్లి.. ఫైవ్‌స్టార్ హోటల్ అనుభూతిని అందిస్తున్నాం’ అని వివరిస్తారు ఓ స్టార్ హోటల్ చెయిన్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వినయ్ అరోరా. మన కోసం ఐదు నక్షత్రాలు దిగొస్తాయంటే.. ఎవరు మాత్రం కాదంటారు?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Prawn Biryani | హైదరాబాదీ బిర్యానీల్లో నయా ట్రెండ్ రొయ్యల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా
హైదరాబాద్‌లో నోరూరించే దొన్నె బిర్యానీ.. ఎక్కడ దొరుకుతుందంటే..?
Biryani history | బిర్యానీ వెనుక ఇంత కథ ఉందా..? వీడియో
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

