Resham Sutra | చేనేత రంగంలో మహిళా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దారం మగ్గం మీదికి వచ్చేవరకూ వాళ్లు పడే కష్టం చూస్తే.. గుండె బరువెక్కుతుంది. ఇక సిల్కు నూలును వడకడానికి ఇప్పటికీ కాళ్లూ చేతులే ఆధారం. అందులోనూ తొడ మీద దారాన్ని పేనడమంటే నరకమే. నేత కుటుంబాల్లో ఆ బాధ్యత చాలావరకూ మహిళలదే. ఆ కష్టాలను దగ్గరనుంచి చూసిన కునాల్ వైద్ తన ‘రేషం సూత్ర’ ఫౌండేషన్ ద్వారా సిల్క్ నూలును వడికే ఆధునిక సోలార్ యంత్రాలను ఉచితంగా అందిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికే 14 రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు పంపిణీ చేశారు. ఈ యంత్రాల సాయంతో పట్టు, నూలు దారాలను సులువుగా వడకవచ్చు. ఒక్కో యంత్రం ధర పదివేల నుంచి నలభైవేల రూపాయల వరకూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 500 మంది లబ్ధిదారులు ఉన్నారు. యంత్రాల పుణ్యమాని 40వేల మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడ్డారు.
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”