Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా
Akanksha Sharma | సరికొత్త హంగులు, కొత్తకొత్త డిజైన్లు, ఆకట్టుకునే ఫర్నిచర్ అనగానే ఐకియా ( IKEA ) గుర్తుకొస్తుంది. ఆ బహుళజాతి సంస్థ డిజైనర్ల బృందంలో ఒకే ఒక్క భారతీయురాలు.. ఆకాంక్ష శర్మ. తన సూచనలతోనే భారతీయ మార్కెట్లో విక్రయించే ఫర్నిచర్‌ను రూపొందిస్తుంది ఆ సంస్థ. ఢిల్లీలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఆకాంక్ష. అప్పటికే ఆ ఉమ్మడి కుటుంబంలో ఎంతోమంది డాక్టర్లు, ఇంజినీర్లు ఉన్నారు. తల్లిదండ్రులు తనను కూడా ఆ దిశగా అడుగులు వేయించాలని చూశారు. కానీ ఆకాంక్ష నలుగురూ నడిచిన ఎంగిలి దారిని తిరస్కరించింది. తనకు ఇష్టమైన డిజైనింగ్ రంగం వైపు వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేసింది.

నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, స్వీడన్ గృహోపకరణాల దిగ్గజం ఐకియాలో కొలువు సంపాదించింది. ఆ సంస్థలో డిజైనర్‌గా చేరిన తొలి భారతీయ మహిళ ఆకాంక్ష. అప్పటికి తన వయసు పాతికేండ్లు. ఐకియా భారత్‌లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది ఆకాంక్ష. ప్రస్తుతం వ్యర్థాల నుంచి కొత్త మెటీరియల్‌ను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నది. 2030 నాటికి ఆ ఆలోచనలకు ఓ రూపమిచ్చి.. ప్రపంచమంతా విక్రయించే అతిపెద్ద పనిని భుజాన వేసుకున్నది. పాత వస్తువులను సరికొత్తగా రీ-డిజైన్ చేయడం మీదా దృష్టిపెట్టింది. ‘రంగ్‌సూత్ర’ అనే సంస్థ సహకారంతో చేతివృత్తులనూ ప్రోత్సహిస్తున్నది. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా అండర్-30 విభాగంలో చోటు సంపాదించుకుని వార్తల్లో నిలిచింది ఆకాంక్ష.

Read More :
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

