Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..
Rajyalaxmi | ఉన్నత విద్యలు చదివిన మహిళలు చాలామందే ఉంటారు. కానీ, డాక్టర్ రాజ్యలక్ష్మి పట్టుదలతో సాధించిన పీహెచ్డీ పట్టాకు ఓ ప్రత్యేకత ఉంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టినా అడుగడుగునా సవాళ్లను అధిగమించారామె. అంతిమంగా దక్షిణ భారతదేశంలోనే పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళగా రికార్డు సృష్టించారు.
నా కష్టానికి, కడగండ్లకు ప్రతిఫలం డాక్టరేట్ పట్టా. నాలాంటి ఎంతోమంది సంచార జాతుల ఆడపిల్లలకు ఇదో స్ఫూర్తి. ‘నా బిడ్డ పేరుకు ముందు ఎప్పటికైనా డాక్టర్ అన్న హోదా చేరుతుంది’ అంటూ నిత్యం నన్ను ప్రోత్సహించేవారు నాన్న. ఆయన కేంద్ర సర్వీసులో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేసేవారు. బైల్ కమ్మర అనే సామాజిక వర్గం మాది. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే. మా వారు తులసీరామ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. నాకు ఇద్దరు బాబులు. చిన్ననాటి నుంచే బాగా చదువు కోవాలని కోరిక. పదో తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. ‘నువ్ ఎలాగైనా డాక్టర్ అవ్వాలి బిడ్డా’ అంటూ బైపీసీలో చేర్పించారు నాన్న. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగానే కుటుంబంలో ఒడుదుడుకులు. మైనారిటీ తీరగానే పెండ్లి చేశారు. అయినా, చదువుకోవాలనే కోరిక చావలేదు.
సినిమా పేరు చెప్పి..
పెండ్లి తర్వాత మళ్లీ చదువుపై ధ్యాస మళ్లింది. ఇంట్లో చెబితే ఏమైనా అంటారేమోనన్న భయం. రహస్యంగా చదువుకోవడం ప్రారంభించాను. మా ఆయన డ్యూటీకి వెళ్లిన తర్వాత, పనులన్నీ పూర్తిచేసి పుస్తకాలు ముందేసుకునేదాన్ని. పరీక్షలప్పుడైతే, రాత్రిళ్లు అందరూ పడుకున్న తర్వాత చదువుకునేదాన్ని. సినిమాకు వెళ్తున్నానని చెప్పి పరీక్షలకు హాజరైన
సందర్భాలూ ఉన్నాయి.

ఇంగ్లిష్ అంటే ఇష్టం.
డిస్టెన్స్‌లో బీకామ్ పాసైన తర్వాతే.. నా చదువుల గురించి ఇంట్లో తెలిసింది. నా పట్టుదల చూసి మావారు మెచ్చుకున్నారు. ఇక అబద్ధం చెప్పాల్సిన అవసరం రాలేదు. కొందరు బంధువులు మాత్రం సంప్రదాయం పేరుచెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అవేవీ పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టిపెట్టాను. నాకు ఇంగ్లిష్ అంటే ఇష్టం. అందుకే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా ఎంఏ ఇంగ్లిష్ చేశాను. ఇక్కడ అయితే సెలవుల సమస్య వస్తుందని.. రాజస్థాన్‌లోని శ్రీజగదీశ్ ప్రసాద్ ఝబర్మల్ టిబ్రివాలా విశ్వవిద్యాలయం నుంచి సాఫ్ట్‌స్కిల్స్‌లో పీహెచ్డీ చేశాను. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో నాకు డాక్టరేట్ పట్టా అందించారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాను. సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి ‘హలో’, ‘ప్రొఫెషనల్ ఎథిక్స్’, ‘మై ఫిట్నెస్ మంత్ర’ పేరుతో మూడు పుస్తకాలు రాశాను. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం.. పీడీఎఫ్ స్కాలర్షిప్. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఏదైనా యూనివర్సిటీలో నాకు ఉద్యోగం కల్పిస్తే.. ఉన్నతవిద్యను అభ్యసించడంతో పాటు మరింత మందికి పాఠాలు చెప్పే అదృష్టం దొరుకుతుంది. దయచేసి, నా అభ్యర్థనను మన్నించ ప్రార్థన.
…?డప్పు రవి
Read More :
కార్పొరేట్ కొలువు వదిలేసి 4 దేశాలు చుట్టొచ్చింది.. బేకరీ స్టార్ట్ చేసింది”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

