e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

యాదాద్రి, జూన్‌7: ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కొవి డ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మండలంలో కొనసాగుతున్నది. సూ పర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్‌ అందజేస్తున్నట్లు యాదగిరిగుట్ట పీహె చ్‌సీ వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. సోమవారం యాదగిరి గుట్ట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 242 మంది సూపర్‌ స్ప్రెడర్లకు మొదటి డోసు, 12 మందికి రెండో డోస్‌ టీకాలు అందజేసినట్లు వివరించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాణి, మంజులత తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో 70 మందికి టీకాలు
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 70మందికి కోవిడ్‌ టీకాలు వేసినట్లు మండల వై ద్యాధికారి ప్రణీష తెలిపారు. మొదటి విడత టీకాలు వేయిం చుకున్నవారు రెండో విడుత కూడా వేయించుకోవాలన్నారు.
తుర్కపల్లిలో 90మందికి
తుర్కపల్లి: మండలంలోని పీహెచ్‌సీ, రుస్తాపూర్‌, పెద్ద తండా లో 90 మందికి టీకాలు వేసినట్లు డా. చంద్రారెడ్డి తెలిపారు.
అడ్డగూడూరులో 40 మందికి
అడ్డగూడూరు:మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో సోమవారం 40 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు మండల వైధ్యాధికారి నరేశ్‌ తెలిపారు.
ఆశా వర్కర్లకు మాస్కులు పంపిణీ
చౌటుప్పల్‌: మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం భారత సే వ సహకార ఫోరం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గోవర్థన్‌ రెడ్డి, తాడూరి పరమేశ్‌, బండగారి వెంకటేశం పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ఆలేరు టౌన్‌: కొవిడ్‌ సమయంలో పారిశుధ్య కార్మికులు అం దిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ మెంబర్‌ పసుపునూరి వీరేశం, ఆర్యవైశ్య సంఘం మండలాధ్య క్షుడు సముద్రాల కుమార్‌ అన్నారు. ఆలేరులో సోమవారం పారిశుధ్య కార్మికులకు, మీడియాకు భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాధవి, కమిషనర్‌ లావణ్యలత, ఆర్యవైశ్యులు వెంక టేశ్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, సత్యం, ఉపేందర్‌, రామన్న, శివు డు, భద్రినాథ్‌, వేణు, సంతోష్‌, శివ పాల్గొన్నారు.
జ్వరం, జలుబు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి
ఆత్మకూరు(ఎం), జూన్‌7: జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని మండల ప్రత్యేకాధికారి శ్యామ్‌ సుందర్‌ అన్నారు. సోమవారం మండలంలోని పల్లెర్లలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేం ద్రాన్ని పరిశీలించారు.కార్యక్రమంలో జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంపీడీవో రాములు, ఆరోగ్య కేంద్రం సీహెచ్‌వో కరుణాకర్‌, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధి సుందరయ్య కాలనీలో కొవిడ్‌ బాధిత కుటుంబానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అండగా నిలిచారు. ఆమన ఆదేశాల మేర కు సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి రూ.20వేల సాయం అంద జేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు కల్యాణ్‌ చక్రవర్తి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ యాకుబ్‌ రె డ్డి, మాజీ చైర్మన్‌ మేఘారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీను, నాయకు లు విజయభాస్కర్‌రెడ్డి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్‌: లాక్‌డౌన్‌ నేపధ్యంలో ప్రభుత్వం అంద స్తున్న రేషన్‌ సాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ ప్రేమలత, ఎంపీటీసి కల్పన అన్నారు. సోమవారం మండలంలోని అనాజిపురంలో ఉచిత రేషన్‌ను ప్రారంభించా రు. కార్యక్రమంలో డీలర్‌ బాలకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు అందజేత
ఆత్మకూరు(ఎం): మండలంలోని సర్వేపల్లిలో గత నెల 23న మచ్చ స్వామి కరోనాతో మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు మగపిల్లలతో పాటు భార్య ఉంది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్పందించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణవేణి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాధ్యురాలు కవిత మృతుడి కుటుంబానికి నిత్యావ సర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ చిన్నారులను సంరక్షించే బాధ్యత తీసుకునేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ముందుకు వచ్చిందని పిల్లల తల్లి రేణుక ఒప్పుకుంటే పిల్లల సంరక్షణ కోసం డిపార్ట్‌మెంట్‌ తరు పున ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స ర్పంచ్‌ ఎల్లయ్య, చైల్డ్‌ లైన్‌ సోషల్‌ వర్కర్‌ వరప్రసాద్‌, ఐసీడీఎ స్‌ సూపర్‌వైజర్‌ జ్యోతి, అంగన్‌వాడీ టీచర్‌ అండాలు, నీడ్‌ స్వచ్చంద సంస్థ చైర్మన్‌ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
సేవలు మరువలేనివి
భువనగిరి టౌన్‌: లాక్‌డౌన్‌ సమయంలో దాతలు చేస్తున్న సేవ లు మరువ లేనివని పట్టణ సీఐ సుధాకర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని నిరుపేదలకు, యాచకులకు, బస్టాం డ్‌, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులకు సోమవారం 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతిమహేశ్‌, టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌లతో కలిసి భోజన ప్యాకెట్లు అంద జేశారు. కార్యక్రమంలో డోగిపర్తి రవికాంత్‌, బచ్చు సోమేశ్వర్‌, సంకీర్త్‌, నరేశ్‌, ఆటో శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement