తుర్కపల్లి: మండలంలోని గొల్లగూడెం ఉప సర్పంచ్ కూకుట్ల సునీతను ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ గురు వారం కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు.
జూన్ 25న 8మంది వార్డు సభ్యులకు 5గురు వార్డు సభ్యులు ఆర్డీవో భూపాల్‌రెడ్డి సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. తెలంగాణ పంచాయతీరాజ్ (2018) చట్టాన్ని అనుసరించి ఉప సర్పంచ్ సునీతను పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.