రైతు బంధు

- కరోనా కష్టకాలంలోనూ ఆగని పెట్టుబడి సాయం
- యాసంగి’లో రైతులకు అండగా తెలంగాణ సర్కారు
- ఈ నెల 27 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
- గత యేడాది జిల్లాలో 2,17,795 మంది రైతులకు రూ.296.70కోట్ల సాయం
- ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం
యాసంగి సాగుకు పెట్టుబడి కోసం ఏ రైతు కూడా ఇబ్బందులు పడొద్దు. ఈ నెల 27 నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సాయం అందించాలి. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలి. దీనికోసం అవసరమైన రూ. 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించాం.
- ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు
పెద్ద మనసు చాటుకున్న సీఎం కేసీఆర్
ప్రతి యేటా పంటల సాగు కోసం రైతన్నలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం రైతులకు పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగు బాట పట్టాల్సి వస్తోంది. ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. రైతుల కష్టాలను దూరం చేసి వారి మోముల్లో చిరునవ్వులు చిందించేందుకు పెట్టుబడి సాయం అందించి ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. రైతు బంధు పథకం కింద గత మూడేండ్లుగా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తుండగా.. కరోనా పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రస్తుత యాసంగి సాగుకు సైతం సాయం అందించేందుకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా గతంలో 2,17,795 మంది రైతులకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా రూ.296.70 కోట్లు అందించగా.. యాసంగి సాయాన్ని ఈ నెల 27 నుంచి జనవరి 7వరకు రైతుల ఖతాల్లో జమచేయనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లా రైతాంగం సంబురపడుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది వర్షాకాలం నుంచి నియంత్రిత పద్ధతుల్లో పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో యాసంగిలోనూ నియంత్రిత పద్ధతిలోనే రైతులు పంటల సాగుకు ఉపక్రమించారు. ఈ సమయంలోనే రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధపడ్డారు. గత వానకాలం సాగులోనూ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో లాక్డౌన్ పరిస్థితుల్లోనూ పెట్టుబడి సాయాన్ని అందించారు. జిల్లా వ్యాప్తంగా 2,17,795 మంది రైతులకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా రూ.296.70 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. అయితే యాసంగిలో రైతు బంధు సాయం పొందే రైతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గతంలో పాసుపుస్తకాలు పొంది బ్యాంక్ ఖాతాల వివరాలు అందించని వారితోపాటు, ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాసుపుస్తకాలు మంజూరైన చాలామంది రైతులు ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్ చేసి వారి జాబితాను సైతం సిద్ధం చేసి ఉంచారు. ప్రభుత్వం యాసంగి సాగుకు సంబంధించి విధివిధానాలను ప్రకటించిన తర్వాత కొత్తవారికి సైతం సాయం అందించే విషయాన్ని అధికారులు పంపించనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఐదు విడుతల్లో సాయం రూ.1,043.3 కోట్లు..
ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సీజన్‌కు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. 2018 వానకాలం, యాసంగి సాగుకు ఎకరాకు రూ.4వేల చొప్పున సాయాన్ని అందించిన ప్రభుత్వం 2019 వానకాలం నుంచి పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచింది. ఈ క్రమంలో జిల్లాలోని రైతాంగానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు విడుతల్లో రూ.1,043కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. 2018 వానకాలం సాగుకు 1,71,882 మంది రైతులకు కోట్లను ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందజేసింది. 2018 యాసంగిలో 1,62,858 మంది రైతులకు రూ.198.5 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. 2019 వానకాలంలో 1,72,343 మంది రైతులకు రూ.216.83 కోట్లను ప్రభుత్వం అందజేయగా..2019 యాసంగిలో 1,25,205 మంది రైతులకు రూ.127.85 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. 2020 వానకాలంలో విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం 2,17,795 మంది రైతులకు రూ.296.70కోట్ల సాయాన్ని అందించింది.
విడుతల వారీగా సాయం జమ..
యాసంగిలో పెట్టుబడి సాయం కోసం రూ.7,300 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. తొలుత విస్తీర్ణం తక్కువగా ఉన్న రైతులకు రైతు బంధు అందించి, క్రమం గా ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో సాయం మొ త్తాన్ని జమ చేయనున్నారు. ఈ లెక్కన.. మొదట అర ఎ కరం లోపు ఉన్న రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జ మ చేయనున్నారు. ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు.. ఆ పైగా విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు చేయనున్నారు. ప్రభుత్వం నుంచి విధివిధానాలపై స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్