సోమవారం 18 జనవరి 2021
Yadadri - Dec 04, 2020 , 00:22:21

కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా రాస్తారోకో

కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా రాస్తారోకో

ఆలేరు టౌన్‌ : కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆలేరులో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ నర్సింహులు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో ఎంఏ ఎక్బాల్‌, జూకంటి పౌల్‌, బుగ్గ నవీన్‌, కాసు నరేశ్‌, వడ్డెమాన్‌ శ్రీను, పిక్క గణేశ్‌, బండ శ్రీను, మణికంఠ, మల్లేశ్‌, ఇస్తారి, నర్సింహులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ఆత్మకూరు(ఎం): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు రచ్చగోవర్దన్‌, గోపాల్‌రెడ్డి, మండల కార్యదర్శి మల్లేశం, సత్తయ్య, స్వామి, రాంరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

తుర్కపల్లిలో... 

తుర్కపల్లి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పోతరాజు జహంగీర్‌, ఎరుకల వెంకటేశ్‌గౌడ్‌, గోవర్ధన్‌ అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గురువారం మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని, దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. నాయకులు కొక్కోండ లింగయ్య, మాతయ్య, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.