Yadadri
- Oct 31, 2020 , 00:28:46
VIDEOS
రైతువేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి

తుర్కపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏడీఏ పద్మావతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేసేలా స్థానిక అధికారులు పర్యవేక్షించాలన్నారు. మండలంలోని 6 క్లస్టర్ల పరిధిలో 6 రైతువేదికల నిర్మాణాలు చేపడుతుండగా ఐదు రైతువేదికల నిర్మాణ పనులు వేగంగా సాగుతూ త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ యాకూబ్, ఏవో దుర్గేశ్వరి, నాయకులు జక్కుల వెంకటేశం, పలుగుల మధు, గోపిమనోహర్రెడ్డి, ఏఈవో ఉమారాణి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
MOST READ
TRENDING