శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Aug 06, 2020 , 23:08:45

యాదాద్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు

యాదాద్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో కట్టుదిట్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం లోపల, బయట ఏయే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బాంబుస్కాడ్‌లు ఏర్పాటు చేయాలి, ఎంతమంది సిబ్బంది అవసరం తదితర విషయాలపై  గురువారం ఆక్టోపస్‌ టీమ్‌ అధ్యయనం చేసింది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆక్టోపస్‌ టీమ్‌ ప్రధాన ఆలయం, క్షేత్ర పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆలయంలో కట్టుదిట్ట భద్రత, సిబ్బంది పహారా, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించింది. ప్రధాన ద్వారం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశించే మార్గం, బయటకు వచ్చే ప్రాంతాలతో పాటు క్యూలైన్లు, అష్టభుజి మంటపాలు, గర్భగుడికి ఎదురుగా సీసీ కెమెరాలు అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


VIDEOS

logo