శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Aug 05, 2020 , 22:58:42

ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దు

ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దు

భువనగిరి : బస్వాపురం రిజర్వాయర్‌ పనులను అడ్డుకోవద్దని, భూ నిర్వాసితులకు న్యాయపరమైన నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌  హామీఇచ్చారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తులతో సమా వేశమై మాట్లాడారు.రిజర్వాయర్‌ పనులకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతామని చెప్పారు. సమావేశంలో రూరల్‌ సీఐ జానయ్య, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు ఉడుత శారదాఆంజనేయులు తదితరులు ఉన్నారు.

కాల్‌సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి..

కరోనా లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని సేకరించి సత్వర వైద్య సేవలు అందించేందుకు కాల్‌సెంటర్‌ అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. బుధవారం వైద్య సిబ్బందితో గూగుల్‌మీట్‌ ద్వారా మాట్లాడారు. సబ్‌సెంటర్లకు హోం ఐసోలేషన్‌ కిట్లను త్వరగా చేర్చాలన్నారు. కాల్‌సెంటర్‌ ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని సేకరించి వైద్యాధికారులకు అందించి 17రోజులపాటు పర్యవేక్షించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆశాలు, ఏఎన్‌ఎంలు కొవిడ్‌ బాధితుల సమగ్ర సమాచారం సేకరించాలన్నారు. ట్రైనీ కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు పాల్గొన్నారు.