Yadadri
- Jul 09, 2020 , 22:48:02
VIDEOS
అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- ‘గూగుల్ మీట్'లో కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి : వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు రాకుండా మండలాల్లో, మున్సిపాలిటీలలో అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ‘గూగుల్ మీట్' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యశాఖ ఆధ్వర్యంలో హైరిస్క్ ప్రదేశాలను గుర్తించి ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పక పాటించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధికారక దోమలను నాశనం చేసేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో వైద్యసిబ్బంది సామాజికదూరాన్ని పాటిస్తూ, ఆరోగ్య చర్యల్లో భాగంగా మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. గూగుల్ మీట్లో వివిధ శాఖల అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING