ములుగు : పండుగపూట ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మహఅశ్విన్ వాజేడు మండలంలోని కొంగాల గుట్టల్లోని దూసపాటి లొద్ది (వి ఫాల్స్) జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
BCCI | బీసీసీ అధ్యక్ష రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్..