Rajastan | ప్యూన్ పోస్టు కోసం 25 లక్షల దరఖాస్తులు.. ఇంజినీరింగ్, ఎంబీఏ, పీహెచ్డీ, పోస్టు గ్రాడ్యుయేట్లే ఎక్కువ!
Rajasthan | రాజస్థాన్‌లో నిరుద్యోగం విలయతాండం చేస్తోంది. అక్కడ 53,479 ప్యూన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 24.76 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు టెన్త్ అర్హత కాగా, బీటెక్, ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
Rajastan | దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. చదువుకు తగిన జాబ్ రాకపోవడంతో ఏదో ఒక జాబ్‌లో సెటిలవ్వాలన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఇటీవల ప్యూన్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం 53,479 ప్యూన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు టెన్త్ అర్హత కాగా.. డిగ్రీ/బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, లా, పీహెచ్‌డీలు చేసిన వాళ్లే ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ప్యూన్ పోస్టుల కోసం సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా, దీనిపై పలువురు ఉద్యోగార్థులు స్పందించారు. 2018 నుంచి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నా. ఇంకా సక్సెస్ కాలేకపోయాను. కనీసం ప్యూన్ జాబ వచ్చినా కూడా నిరుద్యోగిగా ఉండే బాధ తప్పుతుందని జైపూర్‌లోని గోపాలపుర ప్రాంతంలో కోచింగ్ తీసుకుంటున్న కమల్ కిశోర్ తెలిపారు. తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగం రావడం అంటే జీవితానికి భద్రత అన్నట్లే.. ప్యూన్‌గా నీళ్లు ఇవ్వడమైనా సరే.. ఏ అవకాశాన్ని కోల్పోవద్దని భావించామని పీజీ పూర్తి చేసిన తనూజా యాదవ్, ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన సుమిత్రా చౌదరి అభిప్రాయపడ్డారు.
కాగా, ప్యూన్ పోస్టుల కోసం చివరి ఐదు గంటల్లోనే దాదాపు 1.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రతి ఆరు సెకన్లకు ఒక అప్లికేషన్ నమోదైంది. ఇంత భారీ ట్రాఫిక్ కారణంగా సైట్ తరచూ క్రాష్ అయ్యింది. దీనివల్ల అప్లికేషన్ ప్రక్రియలో పలువురు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరి డాక్యుమెంట్లు అప్లోడ్ కాలేవు. దీంతో అప్లికేషన్ గడువును పొడిగించాలని పలువురు నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వేడుకుంటున్నారు. చిన్న చిన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం రాజస్థాన్‌లో ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో 2399 ఫారెస్ట్ గార్డు పోస్టుల కోసం దాదాపు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజస్థాన్‌లో అధికారిక లెక్కల ప్రకారం 18 లక్షల నిరుద్యోగులు రిజిస్టరయ్యారు. అయితే మొత్తం నిరుద్యోగుల సంఖ్య 35 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

