Anupama Parameswaran | మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. మలయాళంతో పాటు తెలుగులోను సినిమాలు చేస్తూ అలరిస్తుంది. రీసెంట్గా కిష్కిందపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన ‘కిష్కిందపురి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను నమోదు చేసింది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీగా ఆదరించారు. ఇప్పటివరకు ఈ మూవీ రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా చేరిపోయింది.
సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఇటీవల నిర్వహించిన ‘కిష్కిందపురి’ సక్సెస్ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ, తన జీవితంలోని ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించగా, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాకు ఓ క్లోస్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం మనస్పర్థల వల్ల అతనితో మాట్లాడటం మానేశాను.ఆ తర్వాత అతను పంపిన మెసేజ్‌లకు స్పందించలేదు. రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడన్న వార్త విని షాక్ అయ్యాను. మనతో ఉన్న వారితో తక్కువగానైనా మాట్లాడాలి, ప్యాచ్ అప్ కావాలి. లేకపోతే జీవితాంతం బాధే మిగిలిపోతుంది అంటూ అనుపమ భావోద్వేగానికి లోనయ్యారు.
కిష్కిందపురి మూవీ విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో కౌశిక్ పెగాళ్ళపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హారర్ – మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ శక్తివంతమైన నటనతో అలరించగా, బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తగా ట్రై చేసిన పాత్రకు మంచి ఆదరణ లభించింది. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ వర్క్ సినిమాకి పెద్ద ప్లస్‌గా నిలిచాయి.సినిమా విడుదలైన 10 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ₹25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి కొట్టింది. వివిధ ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలు, పాజిటివ్ మౌత్ టాక్, యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఈ విజయానికి కారణమయ్యాయి.