వెంకటాపురం(నూగురు): మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో ఉరి వేసుకోని యువకుడు అత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెస్తగూడెం గ్రామానికి చెందిన బేగ విజయ్(22) అనే యువకుడు ఎలక్ట్రిషన్‌గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. విజయ్ గత కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం పై దిగాలుగా ఉండే వాడని తెలిపారు.
ప్రేమించిన అమ్మయి విషయంలో మదనపడుతూ క్షణికావేవేశంలో జీవితం పై విరక్తి చెంది సోమవారం తెల్లావారు జామున ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి దూలానికి ఉరి వేసుకోని చనిపోయి ఉన్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొప్పుల తిరుపతి రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.