Suicide | ఖిలావరంగల్: వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ధర్మారం రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, వరంగల్ జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపిన కథనం ప్రకారం. గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కూలి ఉడత బన్నీ (19) వ్యక్తిగత కారణాలతో ధర్మారం రైల్వే గేట్ సమీపంలోని మైలురాయి నెంబర్ 381/24- 26 వద్ద చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో అతడి తల, మొండెం విడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి ఎంజీఎం దవాఖానాలోని మార్చరిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.