నమస్తే నెట్వర్క్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, పోలీస్, అధికారులు, నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ర్యాలీలు నిర్వహించి, ఆసనాలు వేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. యోగ కేవలం వ్యాయామమే కాకుండా మన ప్రాచీన ధ్యాన సంప్రదాయానికి నిదర్శమని కొనియాడారు.