హనుమకొండ చౌరస్తా, మే 9: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పోరాడుతున్న భారత సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆంజనేయస్వామికి అభిషేకం, పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ రాముల సునీత పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో ఎంతో వీరోచితంగా పోరాడుతున్న మన భారత సైన్యానికి ఆ భగవంతుడు మరింతశక్తిని ఇచ్చి విజయపదంలో నడిపించాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య వరంగల్ నగర శాఖ అధ్యక్షుడు తనుగుల అనిల్‌కుమార్, దేవాలయ వేద పండితుడు గంగు మణికంఠశర్మ అవధాని, ప్రణవ్, శ్రవణ్‌కుమార్, ఆలయ సిబ్బంది మధుకర్, సుధాకర్‌రావు, రజిత, భక్తులు పాల్గొన్నారు.